కొడంగల్లో చెల్లని రేవంత్ ముఖం రాష్ట్రంలో చెల్లుతుందా? టీఆర్ఎస్ పైనా వైఎస్ షర్మిల నిప్పులు
వికారాబాద్ జిల్లా కొడంగల్ లో పర్యటించిన వైయస్సార్ టిడిపి అధ్యక్షురాలు వైయస్ షర్మిల టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. షర్మిల వికారాబాద్ జిల్లా కొడంగల్ నుంచి పాదయాత్రను పున:ప్రారంభించి బహిరంగ సభలో ఆమె తనదైన శైలిలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల పై మండిపడ్డారు. కొడంగల్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి ని ఓడించారు అంటూ వైయస్ షర్మిల పేర్కొన్నారు.

ఇంట్లో గెలవలేని రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గెలుస్తాడా?
ముఖం చెల్లని రేవంత్ ను రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేసిందని పేర్కొన్న వైయస్ షర్మిల, కొడంగల్ లో ముఖం చల్లని రేవంత్ ముఖం రాష్ట్రం మొత్తం చెల్లుతుందా అంటూ ప్రశ్నించారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని కానీ ఇంట్లోనే గెలవని వ్యక్తి రాష్ట్రంలో గెలుస్తాడా అంటూ నిలదీశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విఫలమయ్యారని మండిపడ్డారు.

టీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన హామీలు మాటేంటి?
వై.ఎస్. రాజశేఖరరెడ్డి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు పాలించి అద్భుతాలు చేశారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి హామీని నెరవేర్చారన్నారు. కానీ కేసీఆర్ ఎన్ని హామీలు నెరవేర్చారు? రుణమాఫీ ఏమైంది? దళితులకు మూడెకరాల భూమి ఎక్కడ? రైతులకు వాగ్దానం చేసిన ఉచిత ఎరువులు ఎక్కడ? అంటూ వైయస్ షర్మిల బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కు ప్రశ్నల వర్షం కురిపించారు. కొడంగల్‌ను అభివృద్ధి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారని, చిన్న దొర కేటీఆర్ కొడంగల్ ను దత్తత తీసుకొని సిరిసిల్లలా అభివృద్ధి చేస్తానని చెప్పారని, కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ల్యాండ్ సెటిల్మెంట్ లపై మండిపడిన షర్మిల
చిన్న దొర కాలికి దెబ్బ తగిలితే ఆయన మెదడు పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు. ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు బంగారు కొడంగల్ చేస్తామని ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ.. వారి హామీ మేరకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు. కోస్గికి బస్ డిపో హామీ ఏమైందో చెప్పాలన్నారు. ఇక ఇదే సమయంలో ఒక దొంగ పోయాడు అనుకుంటే మరో దొంగ వచ్చాడని అతనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటూ విమర్శించారు వైయస్ షర్మిల. ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తూ, ఆ ఎమ్మెల్యే అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు.

దిక్కుమాలిన పాలన కేసీఆర్ ది
అంతేకాదు ఎనిమిదేళ్లుగా కొడంగల్ ను అభివృద్ధి చేయలేదని, ప్రజలు అభివృద్ధిని కాంక్షించి ఓట్లు వేస్తే ప్రజలను మోసం చేశారంటూ వైయస్ షర్మిల మండిపడ్డారు. ఇక పోలీసులను పనోళ్లు గా వాడుకుంటున్నారని ఎదురుతిరిగితే బెదిరింపులకు పాల్పడడంతో పాటుగా ప్రాణాలు తీస్తున్నారు అంటూ వైఎస్ షర్మిల విమర్శించారు. మహిళలకు ఏమాత్రం రక్షణ లేదని, రైతు సంక్షేమం పట్టించుకున్న దాఖలాలు లేవని ఏ వర్గాన్ని ఆదుకోలేని దిక్కుమాలిన పాలన కేసీఆర్ ది అని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కెసిఆర్ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏలాలా?
రాష్ట్రంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని పేర్కొన్న వైయస్ షర్మిల, కెసిఆర్ కుటుంబంలోని వాళ్లందరికీ ఉద్యోగాలు అవసరమా అంటూ మండిపడ్డారు. డిగ్రీలు, పీజీలు చదివిన వాళ్ళు కూలి పనులు చేసుకుంటే కెసిఆర్ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏలాలా అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రం కోసం అప్పులు తెచ్చామని చెప్పిన కేసీఆర్ ఆ డబ్బులు అన్నింటినీ కమీషన్ల పేరుతో కాజేశారని వైయస్ షర్మిల విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కెసిఆర్ పై, మేఘా కృష్ణారెడ్డి పై సెటైర్లు వేశారు వైయస్ షర్మిల.
Recommended Video


కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు
గోల్కొండ సిపాయి గోడ కడితే, కోడిగుడ్డు తగిలి గోడ కూలిందన్నట్టు, కెసిఆర్ సిపాయి మేఘా కృష్ణారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే మూడేళ్లలో మునిగిపోయిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పెద్ద మొత్తంలో కేసీఆర్ అవినీతి కనిపిస్తున్నా ప్రతిపక్షాలు మిన్నకు న్నాయని పేర్కొన్న వైయస్ షర్మిల ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పక్క పార్టీల్లోకి జంప్ అవుతూ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక బిజెపి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసిందని, విభజన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదని వైయస్ షర్మిల నిప్పులు చెరిగారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications