కేసీఆర్ ముందస్తు ఎన్నికల వ్యాఖ్యల వెనుక మతలబు అదే: టార్గెట్ చేస్తున్న వైఎస్ షర్మిల
తెలంగాణ సీఎం కేసీఆర్ ను వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల నిత్యం టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరిని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్న వైయస్ షర్మిల, తాజాగా కెసిఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చేసిన ముందస్తు ఎన్నికల వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు.

కేసీఆర్ ముందస్తు ఎన్నికల వ్యాఖ్యల కుయుక్తులు అందుకే
రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పక్కదారి పట్టించడం కోసమే సీఎం కేసీఆర్ కుయుక్తులు పన్నుతున్నారని వైయస్ షర్మిల విమర్శించారు. సవాళ్లు, ప్రతిసవాళ్లు తప్పితే కేసీఆర్ గారికి ప్రజా సమస్యలపై పట్టింపు లేదని మండిపడిన వైఎస్ షర్మిల సమస్యను పక్కదారి పట్టించడం కోసమే ముందస్తు, వెనుకస్తు అంటూ కెసిఆర్ దోబూచులాడుతున్నారు అంటూ మండిపడ్డారు.ఇక ఇదే సమయంలో తెలంగాణలో కెసిఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతుందన్నది వాస్తవం అంటూ పేర్కొన్న షర్మిల ప్రస్తుతం కెసిఆర్ భయపడుతున్నది వాస్తవం అంటూ తెలిపారు.

రాష్ట్రంలో సమస్యలను ఏకరువు పెట్టిన వైఎస్ షర్మిల
తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని కేసీఆర్ పట్టించుకోవడం లేదని పేర్కొన్న షర్మిల ఆదివాసీలపై పోలీసుల దౌర్జన్యం, మిషన్ భగీరథ కలుషిత నీళ్లతో చనిపోతున్న జనం, ఇంకా పుస్తకాలు రాని బడులు, జీతాలు రాని ఉద్యోగులు, ఉద్యోగాలు లేని యువత, రక్షణ కరువైన మహిళలు ఇలా రాష్ట్రంలో అనేక సమస్యలు పేరుకుపోయాయి అని మండిపడ్డారు. వీటి మీద సీఎం కేసీఆర్ నోరు మెదపలేదు ఎందుకని ప్రశ్నించారు.

కేసీఆర్ నియంత పాలనను ప్రజలు బొంద పెడతారు
మేకపోతు గాంభీర్యం ఎంత ప్రదర్శించినా జనాలకు అంతా తెలుసన్నారు వైఎస్ షర్మిల. ఇప్పుడైనా, ఎప్పుడైనా మీ నియంత, నిరంకుశ పాలనను బొంద పెట్టడానికి జనం ఎప్పటినుండో రెడీగా ఉన్నారని షర్మిల పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో ప్రజల ఆరోగ్యం పట్టని దొరగారి పనితనానికి నిదర్శనం మిషన్ భగీరథ అంటూ మండిపడ్డారు వైఎస్ షర్మిల. స్వచ్ఛమైన నీరు ఇస్తున్నామని గప్పాలు చెప్పుడే తప్పితేమాంసం ముద్దలతో కలుషిత నీళ్లు పంపిణీ అవుతున్నా పట్టించుకొన్నది లేదు అంటూ విరుచుకుపడ్డారు.

మిషన్ భగీరథతో ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు కెసిఆర్
మంచినీళ్ల కోసం కొట్లాటలు బంద్ అయ్యాయో లేదో కానీ విషం నీళ్లతో మనుషుల ప్రాణాలు మాత్రం పోతున్నాయి అంటూ వైఎస్ షర్మిల కెసిఆర్ ను టార్గెట్ చేశారు . గద్వాల్ లో మిషన్ భగీరథ నీరు తాగి వందల మంది అస్వస్థతకు గురికాగా ముగ్గురు చనిపోయారు.90మంది దవాఖానల పాలయ్యారు.నిర్వహణ లేని పాత ట్యాంక్ లకు కొత్త సున్నం వేసి,పాత పైపులైన్లకే కొత్త కనెక్షన్లు ఇచ్చి కోట్లు కొల్లగొట్టి తూతూమంత్రంగా భగీరథ పనులు కానిచ్చి ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు కెసిఆర్ అంటూ వైయస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు.












Click it and Unblock the Notifications