బంతి సోనియా, రేవంత్ కోర్టులో నెట్టిన షర్మిల

Dr YSR Jayanti: నేడు- దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 76వ జయంతి. ఈ సందర్భంగా కుటుంబ స‌భ్యులు ఘ‌నంగా నివాళి అర్పించారు. ఈ ఉదయం కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన సతీమణి వైఎస్‌ విజయమ్మ, వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతి నివాళి అర్పించారు.

వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వైఎస్ జగన్.. సోమవారం సాయంత్రమే తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు చేరుకున్న విషయం తెలిసిందే. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం ఇడుపులపాయకు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేశారు.

YS Sharmila writes a letter to the Sonia Gandhi and CM Revanth Reddy

ఈ ఉదయం వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న విగ్రహానికి పూలమాల వేశారు. వైఎస్‌ విజయమ్మ, భారతితో కలిసి నివాళి అర్పించారు. సమాధిపై పూలమాలను ఉంచి మౌనం పాటించారు. ఆ సమయంలో జగన్ వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.

జగన్ నివాళి అర్పించి వెళ్లిన తరువాత ఆయన చెల్లెలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ వైఎస్ షర్మిల.. ఘాట్ వద్దకు చేరుకున్నారు. తండ్రికి నివాళి అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్ తన జీవితాన్ని అంకితం చేశారని, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన దార్శనికుడని స్మరించుకున్నారు. అచంచల నిబద్ధత, నిస్వార్థ సేవకు వైఎస్సార్ చిరకాలం గుర్తుంటారని అన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకార్థం హైదరాబాద్ లో ఓ మెమోరియల్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వైఎస్ షర్మిల అన్నారు. ఈ మేరకు ఆమె కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేర్వేరుగా లేఖలు రాశారు. వైఎస్ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ఇందులో వివరించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ చెరగని ముద్ర వేశారని షర్మిల అన్నారు. కన్నుమూసి.. 16 సంవత్సరాలు దాటి పోయినా ఆయన జయంతి, వర్ధంతికి నివాళులు అర్పించడానికి తెలంగాణలో మెమోరియల్ లేకపోవడం బాధాకరమని అన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం అనాడు మెమోరియల్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలు కూడా అమలు కాకుండా పోయిందని షర్మిల గుర్తు చేశారు. ఈ విషయంలో ప్రత్యేకంగా చొరవ చూపాలని సోనియా గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేర్వేరుగా లేఖలు రాశారు. సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+