గ్రేటర్ ఎఫెక్ట్, వైసిపి ఫౌండర్‌కు షోకాజ్: 'పార్టీ'ని ఇచ్చిన శివకుమార్‌కు జగన్ షాక్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ వ్యవస్థాపకులు శివకుమార్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ తెలంగాణ పార్టీ అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శివకుమార్‌కు ఆదివారం షోకాజ్ నోటీసులు పంపించారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ నుంచి తప్పుకుంది. దీంతో అసంతృప్తికి గురైన శివకుమార్.. పోటీ చేయక పోవడాన్ని పత్రికాముఖంగా నిలదీశారు.

దీంతో, పార్టీ తెలంగాణ అధ్యక్షులు పొంగులేటి ఆయనకు షోకాజ్ ఇచ్చారు. పార్టీ క్రమశిక్షణ చర్యలు, నిబంధనలు ఉల్లంఘించి మీడియాకు ఎక్కారని అందులో పేర్కొన్నారు. పది రోజుల్లో దీనిపై సమాధానం చెప్పాలని షోకాజ్ నోటీసులో వారు సూచించారు.
కాగా, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుకున్నట్లు అయిదు రోజుల క్రితం ప్రకటించింది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయమని, అయితే పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తామని వైసిపి చెప్పింది. గ్రేటర్ బరి నుంచి వైసిపి తప్పుకోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.
అయితే, గ్రేటర్ బరి నుంచి వైసిపి తప్పుకోవడాన్ని పార్టీ వ్యవస్థాపకులు, ప్రధాన కార్యదర్శి శివకుమార్ ప్రశ్నించారు. ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. పార్టీ పోటీ చేయక పోవడం తనను బాధించిందని ఆయన చెప్పారు. దీంతో అతనికి నోటీసులు జారీ చేశారు.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications