'చంద్రబాబూ! ప్రత్యర్థులం కాదు.. కేసీఆర్‌ను చూసి నేర్చుకో!'
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిపక్షాలను శత్రువుల్లా కాకుండా ప్రత్యర్థులుగా చూస్తున్నారని, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా అలాగే చూడాలని మంగళవారం వైసిపి నేతలు అన్నారు.
తిరుమల: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిపక్షాలను శత్రువుల్లా కాకుండా ప్రత్యర్థులుగా చూస్తున్నారని, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా అలాగే చూడాలని మంగళవారం వైసిపి నేతలు అన్నారు.
మొక్కు చెల్లించుకునేందుకు తిరుమల వచ్చిన ఆయనను వైసిపి నేతలు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి తదితరులు కలిశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.

కేసీఆర్ గొప్ప ప్రజాస్వామ్య నాయకుడు అని మిథున్ రెడ్డి ప్రశంసించారు. చంద్రబాబు కూడా కేసీఆర్‌లా ప్రతిపక్షాలను చూడాలని చెవిరెడ్డి అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలతో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. విపక్ష ఎమ్మెల్యేల నియోజక వర్గాలకు కూడా నిధులు కేటాయిస్తున్నారన్నారు. కాగా, కేసీఆర్ శ్రీకృష్ణ అతిథి గృహంలో విడిది చేశారు.
రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి: కవిత
తెలంగాణ ఉద్యమం సమయంలో ఇచ్చిన మొక్కు చెల్లించుకునేందుకు తిరుమల వచ్చామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముుందుండాలని ఆకాంక్షించారు.
-
లడ్డూ వ్యవహారం లో సుప్రీం తాజా ఆదేశాలు..!! -
భారీగా నిధులు విడుదల చేసిన టీటీడీ -
తిరుమల క్యూ లైన్ లో నినాదాలు- టీటీడీ తాజా అప్పీల్ -
భక్తులకు షాక్!: వెంకటేశ్వర స్వామి ప్రసాదశాలలో గ్యాస్ కష్టాలు! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!!












Click it and Unblock the Notifications