హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ షర్మిల పాదయాత్ర కోసం సమన్వయ కమిటీల ఏర్పాటు: జంబో లిస్ట్ ఇదే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల.. మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తన అన్న, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరహాలోనే ప్రజా ప్రస్థానాన్ని మొదలు పెట్టనున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి బుధవారం ఈ ప్రజా ప్రస్థానం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి ఆశీస్సులను తీసుకోవడానికి ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. షర్మిల వెంట తల్లి వైఎస్ విజయమ్మ ఉంటారు. సాయంత్రం వరకూ ఇడుపులపాయలో గడుపుతారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వస్తారు.

400 రోజుల్లో..4,000 కిలోమీటర్లు..

400 రోజుల్లో..4,000 కిలోమీటర్లు..

2023లో నిర్వహించబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఆవిర్భవించాలనే లక్ష్యంతో వైఎస్ షర్మిల ఈ మహా పాదయాత్రను నిర్వహించనున్నారు. 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో..అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా చేవెళ్ల నుంచే పాదయాత్రను మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

400 రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగేలా షెడ్యూల్‌ను రూపొందించారు. 90 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా వైఎస్ షర్మిల పాదయాత్ర 4,000 కిలోమీటర్ల మేర సాగుతుంది. ప్రతిరోజూ ఉదయం 8:30 గంటలకు పాదయాత్రను ఆరంభమౌతుంది. సాయంత్రం వరకు కొనసాగుతుంది.

పాదయాత్రను విజయవంతం చేయడానికి కమిటీలు..

పాదయాత్రను విజయవంతం చేయడానికి కమిటీలు..

పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ మహా పాదయాత్రను విజయవంతం చేయడానికి వైఎస్సార్‌టీపీ రంగం సిద్ధం చేసింది. పార్టీ విభాగాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసింది. మొత్తం 26 కమిటీలను వైఎస్సార్‌టీపీ ఏర్పాటు చేసింది. అగ్ర స్థాయి నాయకుల నుంచి నియోజకవర్గాల వరకు అన్ని స్థాయిల్లో ఉన్న నాయకులను ఇందులో భాగస్వామ్యులను చేసింది. జిల్లా స్థాయి సమన్వయకులకు ఈ బాధ్యతలను అప్పగించింది.

కమిటీ అధినేతలు వీరే..

కమిటీ అధినేతలు వీరే..

మహా పాదయాత్ర కోసం వైఎస్సార్‌టీపీ మొత్తం 26 జంబో కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేసింది. కొద్దిసేపటి కిందటే- దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. కొండా రాఘవరెడ్డి, తూడి దేవేందర్ రెడ్డి, వాడుక రాజగోపాల్, పిట్టా రామ్‌రెడ్డి, ఏపూరి సోమన్న, సయ్యద్ ముజ్తాబా అహ్మద్, మతీన్ ముజాద్దాది, బానోత్ సుజాత, బీ సత్యవతి, నీలం రమేష్ వంటి నాయకుల సారథ్యంలో ఆయా కమిటీలన్నీ క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపింది.

మొత్తం 26 కమిటీలు..

మొత్తం 26 కమిటీలు..

మొత్తం 26 కమిటీలు ఏర్పాటయ్యాయి. పాదయాత్ర కార్యాచరణ కమిటీ పర్యవేక్షణలో మిగిలినవన్నీ పని చేస్తాయి. రూట్ మ్యాప్ కోఆర్డినేషన్ కమిటీ, లాజిస్టిక్ కమిటీ, అకంపెయినింగ్ కమిటీ, రచ్చబండ-బహిరంగ సభల పర్యవేక్షణ కోసం మొబిలైజేషన్ సమన్వయ కమిటీలను పార్టీ నాయకత్వం ఏర్పాటు చేసింది. పబ్లిసిటీ, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సమన్వయ కమిటీలు ఈ జాబితాలో ఉన్నాయి. సాంస్కృతిక వ్యవహారాలు, ఫిర్యాదులను స్వీకరించడానికి ప్రత్యేక కమిటీలు పార్టీ నాయకత్వం ఏర్పాటు చేసింది.

మెడికల్, లీగల్ కమిటీలు కూడా..

మెడికల్, లీగల్ కమిటీలు కూడా..

పాదయాత్ర చేస్తోన్న సమయంలో వైఎస్ షర్మిల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా మెడికల్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. టీ ప్రియాంక ఆనంద్, ఎం ఫ్రాన్సిస్ విజయ్ కుమార్ దీన్ని పర్యవేక్షిస్తారు. లీగల్ వ్యవహారాలు, రచ్చబండ లేదా బహిరంగ సభలను నిర్వహించడానికి అవసరమైన పోలీసు అనుమతులను తీసుకోవడానికి ప్రత్యేకంగా మరో కమిటీ ఏర్పాటైంది. నియోజకవర్గాల స్థాయిలో నాయకులను సమన్వయ పర్చడానికి లోకల్ ఇంటరాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. పాదయాత్రలో పాల్గొనే వారికి ఆహారం, మంచినీటి వసతిని కల్పించడానికి కోఆర్డినేషన్ కమిటీని అందుబాటులోకి తీసుకొచ్చారు పార్టీ అగ్రస్థాయి నాయకులు.

మహిళలు, యువజనుల కోసం..

మహిళలు, యువజనుల కోసం..

వైఎస్ షర్మిల మహా పాదయాత్రలో అన్ని వర్గాల వారినీ భాగస్వామ్యులను చేయడానికి ఆయా వర్గాల వారీగా సమన్వయ కమిటీలు ఏర్పాటయ్యాయి. మహిళలు, యువకులు, విద్యార్థులు, మైనారిటీలు, దళితులు, వెనుకబడిన తరగతులకు చెందిన వారు, రైతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కోసం వేర్వేరుగా కోఆర్డినేషన్ కమిటీలను వైఎస్సార్‌టీపీ ఏర్పాటు చేసింది. టెక్నికల్ కోఆర్డినేషన్ కమిటీ, వాకర్స్ కోఆర్డినేషన్ కమిటీ, సెక్యూరిటీ కోఆర్డినేషన్ కమిటీలను నెలకొల్పారు. రాయల్ రెడ్డి, వేముల సత్యం.. వైఎస్ షర్మిల భద్రతను పర్యవేక్షిస్తారు.

పాదయాత్ర యాక్షన్ కమిటీలో..

పాదయాత్ర యాక్షన్ కమిటీలో..

వైఎస్ షర్మిల మహా పాదయాత్రను విజయవంతం చేయడానికి రాష్ట్ర స్థాయిలో ఓ కార్యాచరణ కమిటీ ఏర్పాటైంది. ఇందులో కొండా రాఘవరెడ్డి, తూడి దేవేందర్ రెడ్డి, వాడుక రాజగోపాల్, పిట్టా రామ్‌రెడ్డి, ఏపూరి సోమన్న, సయ్యద్ ముజ్తాబా అహ్మద్, మతీన్ ముజాద్దాది, బానోత్ సుజాత, బీ సత్యవతి, నీలం రమేష్ ఉన్నారు. పాదయాత్రకు సంబంధించిన అంశాలన్నింటినీ రాష్ట్రస్థాయిలో ఈ యాక్షన్ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఒక రకంగా ఇది స్టీరింగ్ కమిటీగా పని చేస్తుంది. ఈ 26 కమిటీల్లో సభ్యులుగా స్థానం దక్కించుకున్న నాయకులందరి ఫోన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.

మండల స్థాయిలో..

మండల స్థాయిలో..

వాటిని తక్షణమే పరిష్కరించాలంటూ కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని రావడానికి వచ్చేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారు. వైఎస్ షర్మిలకు మద్దతుగా వైఎస్సార్టీపీ నాయకులు.. మండల స్థాయిలో పాదయాత్రలను నిర్వహిస్తారు. ఏ రోజు ఆమె ఏ నియోజకవర్గానికి చేరుకుంటారో.. ఆ నియోజకవర్గానికి చెందిన నాయకులు, స్థానికులతో కలిసి పాదయాత్రను చేపడతారు. స్థానిక అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్తారు. వాటన్నింటినీ సమన్వయం చేయడానికి గ్రీవెన్స్ కోఆర్డినేషన్ కమిటీని పార్టీ నాయకత్వం ఏర్పాటు చేసింది.

సాయంత్రం 6 గంటల వరకు..

సాయంత్రం 6 గంటల వరకు..

మళ్లీ 3 గంటలకు పాదయాత్రను మొదలు పెట్టి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగిస్తారు. పాదయాత్ర ముగిసిన అనంతరం పార్టీ నేతలతో సమావేశమౌతారు. ఆ రోజు ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, వినతుల గురించి చర్చిస్తారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలతో ఒక నోట్‌ను తయారు చేస్తారు. ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో నెలకొన్న సమస్యలపై అధ్యయనం చేస్తారు. వాటిని పరిష్కరించడానికి ఎలాంటి చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది?, ఎంత మేర బడ్జెట్ ఖర్చవుతుంది? అనే విషయంపై పార్టీ నేతలతో చర్చిస్తారు. కార్యాచరణ కమిటీ ప్రతినిధులతో చర్చిస్తారు.

English summary
YSR Telangana Party announces Coordination committees for YS Sharmila's Padayatra from October 20 in Telangana. The Padayatra will begin from Chevella constituency in Rangareddy district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X