కాంగ్రెస్‌కు మరింత చేరువగా వైఎస్ షర్మిల- ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌తో భేటీ
హైదరాబాద్: కర్ణాటకలో అధికార భారతీయ జనతా పార్టీని మట్టికరిపించిన ఊపు మీద ఉంది కాంగ్రెస్. ఇక ఈ ఏడాది చివర్లో జరిగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం, తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకునే పనిలో ఉంది.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితిని ఎదుర్కొనడానికి అవసరమైన కసరత్తు ఆరంభించింది కూడా. ఇందులో భాగంగా ఇప్పటికే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తెలంగాణలో పర్యటించారు. బహిరంగసభను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా ఆమె బాధ్యతలను సైతం వెనుకాడట్లేదు.

బీఆర్ఎస్‌ను ఎదుర్కొనడంలో భాగంగా- భావసారూప్యం గల పార్టీలను కలుపుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే వామపక్షాలు బీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ దృష్టి వైఎస్ షర్మిలపై పడిందని చెబుతున్నారు. వైఎస్ఆర్టీపీని విలీనం చేసుకోవడమా? లేక పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడమా? అనే విషయంపై తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉందని సమాచారం.
ఈ పరిణామాల మధ్య- వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల- కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బెంగళూరులో ఈ భేటీ ఏర్పాటైంది. డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన నేపథ్యంలో- షర్మిల మర్యాదపూరకంగా ఆయనను కలుసుకున్నారు. పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి అభినందనలు తెలియజేశారు.
కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ని కలిసిన వైఎస్ షర్మిల#YSShamila #DKShivakumar #KPCC #KarnatakaPolitics #Oneindiatelugu pic.twitter.com/49h8Ox2a5Q
— oneindiatelugu (@oneindiatelugu) May 29, 2023
వారిద్దరి భేటీకి సంబంధించిన ఫొటోను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. సుమారు అరగంట పాటు వారిద్దరి మధ్య వేర్వేరు అంశాలపై చర్చ జరిగినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాజకీయాలు కూడా వారిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్టీపీ- కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరొచ్చంటూ గతంలో కూడా వార్తలొచ్చినప్పటికీ.. షర్మిల వాటిని తోసిపుచ్చారు.
డీకే శివకుమార్‌తో తన కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని, అందుకే ఆయనను మర్యాదపూరకంగా కలుసుకున్నానంటూ అప్పట్లో చెప్పుకొచ్చారామె. కాంగ్రెస్‌తో పొత్తు గానీ, తన పార్టీని విలీనం చేసే ప్రతిపాదనలేవీ లేవంటూ తేల్చి చెప్పారు. మరోసారి కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్‌గా పేరున్న డీకే శివకుమార్‌తో షర్మిల భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications