వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యథా మంత్రి తథా అధికారులు.. సిగ్గుతో తలదించుకో ? : కేటీఆర్‌పై షర్మిల నిప్పులు

|
Google Oneindia TeluguNews

వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మరో సారి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా కడిగిపారేశారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో మంగళవాళం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై తీవ్ర గందరగోళం నెలకొంది. తనకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రాలేదంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. లంచం ఇవ్వాలంటున్నారంటూ అధికారులపై ఆరోపణలు చేసింది. కాగా, ఈ ఘటనపై వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. మంత్రి కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు.

Recommended Video

KTR Comments on BJP బీజేపీకి మంత్రి కేటీఆర్ వార్నింగ్... తెలంగాణ బీజేపీ కేసీఆర్ భిక్ష
 సిరిసిల్లలో ఏ పని కావాలన్నా కాసులు చెల్లించుకోవాల్సిందే

సిరిసిల్లలో ఏ పని కావాలన్నా కాసులు చెల్లించుకోవాల్సిందే

చిన్న దొర ఇలాకా సిరిసిల్లలో ఏ పని కావాలన్నా కాసులు చెల్లించుకోవాల్సిందేనని షర్మిల ఆరోపించారు. మొన్నటికి మొన్న ధరణిలో తన భూమిని ఇతరులకు పట్టా చేశారని మండిపడ్డారు. వాటిని సరిచేయించుకోనేందుకు.. ఏండ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగి తిరిగి చివరకు MRO ఆఫీసుకే తన తాళిబొట్టును కట్టింది . తన తాళినే లంచంగా తీసుకొని పనిచేసి పెట్టమంది ఒక మహిళ అంటూ షర్మిల ట్విట్ చేశారు.

 తాళి బొట్టు నమ్మి లక్ష రూపాయల లంచం

తాళి బొట్టు నమ్మి లక్ష రూపాయల లంచం

నిన్న ఇండ్లల్ల పనులు చేసుకుంటూ, దివ్యాంగుడైన భర్తను,ఇద్దరు పిల్లలను పోషించుకునే మహిళకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కావాలంటే తాళి బొట్టు నమ్మి మరీ లక్ష రూపాయల లంచం ఇవ్వాలని అడిగిన అధికార్లకు సిగ్గుండాలని షర్మిల్ ఫైర్ అయ్యాయి. మీకు జీతాలు వస్తలేవా లేక సరిపోతలేవా? యథా మంత్రి తథా అధికారులు అంటూ ఎద్దేవా చేశారు. నీ ఇలాకలో జరుగుతున్న తంతు చూసి తలదించుకో కేటీఆర్ అంటూ తన ట్విటర్ వేదికగా విరుచుపడ్డారు.

 సీఎం కేసీఆర్‌పై నిప్పులు

సీఎం కేసీఆర్‌పై నిప్పులు


అటు సీఎం కేసీఆర్ పై కూడా షర్మిల నిప్పులు చెరిగారు. లక్ష రూపాయల రుణమాఫీని లక్షణంగా వదిలేసిన కేసీఆర్ గారు, రైతులను బ్యాంకర్ల దృష్టిలో రుణ ఎగవేతదార్లను, దొంగలను చేసి ఓట్లేసిన రుణం తీర్చుకొంటున్నారా? అని నిలదీశారు. రుణమాఫీ కోసం ఎదురుచూసిన రైతులు ఈ రోజు రుణం కట్టలేక, వడ్డీ పెరిగిపోయన్నారు. రైతుల ఆస్తులను బ్యాంకులు జప్తు చేసుకొనేవరకు తీసుకొచ్చారు కదా దొర? అంటూ మరో ట్వీట్ లో నిప్పులు చెరిగారు.

 రైతులను దొంగలుగా చేశారు.

రైతులను దొంగలుగా చేశారు.


మీరు రుణమాఫీ చేసి ఉంటే రైతుల ఇంట్లో సామాన్లు బ్యాంకులు జప్తు చేసేవా? అని కేసీఆర్‌ని షర్మిల నిలదీశారు. రైతులు తప్పు చేసిన వారిలా నిలబడేవారా? మీరు చేసిన తప్పుకు రైతులను దొంగలు చేశారని మండిపడ్డారు. సమాజంలో వాళ్ళ గౌరవాన్ని పోగొట్టారు. మీరు రుణమాఫీ చేయరు. ఆత్మహత్యలు చేసుకోకుండా రైతులకు అండగా ఉండరు. రైతులపై మీ ప్రేమ అంతా డ్రామా అంటూ కేసీఆర్ కు చురకులు అంటించారు షర్మిల.

English summary
If you want any work in Sirisilla you have to pay cash.. YS Sharmila says
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X