షర్మిలకు సోనియా, రాహుల్ కీలక హామీ - యాక్షన్ ప్లాన్ రెడీ..!!
వైఎస్ షర్మిల ఢిల్లీలో సోనియా, రాహుల్ తో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం..భవిష్యత్ కార్యాచరణ పైన చర్చించినట్లు సమాచారం. ఈ సమయంలోనే షర్మిలకు స్పష్టమైన హామీ దక్కినట్లు తెలుస్తోంది. దీంతో, ఇక కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనం ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే, ఏపీలోనూ షర్మిల పాత్ర పైన చర్చ జరుగుతున్న వేళ... సమావేశం తరువాత షర్మిల ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.
బ్రేక్ ఫాస్ట్ మీట్ : కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ తో షర్మిల కీలక చర్చలు చేసారు. కొంత కాలంగా కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనం పైన పార్టీ ముఖ్యులు మంతనాలు సాగిస్తున్నారు. తెలంగాణలో కొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రానుండటంతో విలీన ప్రక్రయ పైన స్పష్టత దిశగా షర్మిల అడుగులు వేస్తున్నారు.

అందులో భాగంగా ఈ ఉదయం భర్త అనిల్ తో కలిసి సోనియా, రాహుల్ తో సమావేశం అయ్యారు. ఆ భేటీలో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. ఈ సమయంలో పార్టీ విలీనంతో పాటుగా షర్మిలకు కాంగ్రెస్ పార్టీలో సముచిత గౌరవం దక్కుతుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయంగా షర్మిల భవిష్యత్ పైన స్పష్టత ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
భవిష్యత్ పై హామీ : అయితే, షర్మిల తెలంగాణలో కాంగ్రెస్ కోసం పని చేసేందుకు సంసిద్దత వ్యక్తం చేసారు. ఏపీలో జోక్యం పైన సుముఖంగా లేరని ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు. అయితే, తెలంగాణ కేంద్రంగానే షర్మిలకు ప్రాధాన్యత ఇస్తూ..ఏపీలోనూ పార్టీకి అవసరమైన సమయంలో పని చేసేలా షర్మిలను ఒప్పించినట్లు చెబుతున్నారు.
సోనియా,రాహుల్ గాంధీ తో భేటీ తర్వాత వైఎస్ షర్మిల కామెంట్స్#YSSharmila #RahulGandhi #SoniaGandhi #YSRTP #CongressDeliversGuarantees #AndhraPradesh #Telangana #TSElections #ApElections #Oneindiatelugu pic.twitter.com/zvMavbr8Oh
— oneindiatelugu (@oneindiatelugu) August 31, 2023
షర్మిల సేవలను రెండు తెలుగు రాష్ట్రాలలోనూ వినియోగించుకోవాలనేది కాంగ్రెస్ ఆలోచనగా స్పష్టం అవుతోంది. ఇప్పుడు సోనియాతో సమావేశం సమయంలో షర్మిల రాజకీయ భవిష్యత్ కు మేలు చేసేలా నిర్ణయాలు ఉంటాయని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా తెలంగాణ పైన ఫోకస్ చేయాలని షర్మిలకు సూచించినట్లు సమాచారం. భేటీ తరువాత షర్మిల ఇదే తరహా సంకేతాలు ఇచ్చారు.
షర్మిలకు కీలక బాధ్యతలు : సోనియా, రాహుల్ తో నిర్మాణాత్మక చర్చలు జరిగాయని షర్మిల వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరంతరం పని చేస్తుందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ కు కౌంట్ డౌన్ మొదలు అయిందని షర్మిల వ్యాఖ్యానించారు. దీని ద్వారా తాను తెలంగాణలోనే పని చేస్తానని సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేసారు. ఇక, కాంగ్రెస్ లో విలీనం.. భవిష్యత్ రాజకీయాల్లో తన పాత్ర పైన షర్మిల ఈ నెల 2న వైఎస్సార్ వర్దంతి నాడు స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications