తిరుపతి రోడ్‌సైడ్ హోటల్‌లో.. టాలీవుడ్ విలన్

ప్రముఖ నటుడు ఆశీష్ విద్యార్థి- తిరుపతి వీధుల్లో సందడి చేశారు. కరకంబాడి వద్ద ఓ రోడ్ సైడ్ హోటల్ లో దోసె, వడ టేస్ట్ చేశారు. టేస్ట్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేశారు.

తిరుపతి: ఆశీష్ విద్యార్థి.. బహుభాషా నటుడు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్.. ఇలా దాదాపు అన్ని భాషల సినిమాల్లో నటించిన సత్తా ఉన్న నటుడు. ఎక్కువగా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లకు పెట్టింది పేరు. తెలుగులో రీసెంట్ గా వచ్చిన రైటర్ పద్మభూషణ్ లో నటించారు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ థ్రిల్లర్ మూవీలో నటిస్తోన్నారు.

దీని పేరు ఖుఫియా. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది మూవీ. ఎస్కేప్ టు నౌవేర్ అనే నవల ఆధారంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. అమర్ భూషణ్ రాసిన నవల ఇది. టబు, అలీ ఫజల్, వామిక గుబ్బి.. ఇతర కీలక పాత్రలను పోషిస్తోన్నారు. ఈ ఏడాది జూన్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.

 Actor Ashish Vidyarthi taste South Indias famous food Dosa at a road side hotel in Tirupati

సినిమాలతో బిజీగా ఉండే ఆశీష్ విద్యార్థి- ఓ ట్రావెలర్, ఫుడీ కూడా. రోడ్ సైడ్ హోటల్స్, స్ట్రీట్ ఫుడ్స్ అంటే ఆయన చాలా ఇష్టపడతారు. ఫుడ్ లో కొత్త కాంబినేషన్లనూ ట్రై చేస్తుంటారాయన. వాటన్నింటినీ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లల్లో పోస్ట్ చేస్తుంటారు. బెంగాలీ ఫేమస్ రసగుల్లాను టీతో ట్రై చేశారు. ఇదో కొత్త రకం అనుభూతిని ఇచ్చిందంటూ ఓ వీడియోను షేర్ చేశారు.

తాజాగా తిరుపతిలో ఆయన హల్ చల్ చేశారు. తిరుపతి కరకంబాడి వద్ద ఓ రోడ్ సైడ్ హోటల్ లో కనిపించారు. దీని పేరు దుర్గా హోటల్. ఇక్కడ దోసె, వడ టేస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈరోజును వేడి వేడి దోసెతో స్టార్ట్ చేశాను.. అంటూ కామెంట్స్ జత చేశారు. వడ భలే క్రిస్పీగా ఉందనీ చెప్పారు. దోసె చాలా కారంగా ఉందని, నార్త్ లో ఇలాంటి టేస్ట్ దొరకదనీ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+