తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమ‌ల‌కు కొత్తదారి : మ‌లుపులు లేకుండా కొండ‌పైకి: స‌ర్వే పూర్తి..ఆమోద‌మే త‌రువాయి..!

|
Google Oneindia TeluguNews

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తుల‌కు శుభవార్త‌. తిరుమ‌ల కొండ మీద‌కు మ‌రో ప్ర‌త్యామ్నాయ మార్గం సిద్దం అవుతోంది. దీనికి సంబంధించి దూరం త‌గ్గ‌టంతో పాటుగా ఎటువంటి మ‌లుపులు లేకుండా సుర‌క్షితంగా కొండ పైకి చేరుకొనే విధంగా ప్లాన్ సిద్దం అవుతోంది. దీనికి సంబంధించి ఎల్‌అండ్‌టీ కంపెనీ సర్వే చేసింది. నివేదికను మరోవారంలో తితిదే ఇంజినీరింగ్‌ విభాగానికి అందించనుంది. పాల‌క వ‌ర్గం ఆమోదిస్తే..త్వ‌ర‌లోనే ప‌నులు ప్రారంభం కానున్నాయి.

కొండ పైకి ప్ర‌త్యామ్నాయ మార్గం..

శ్రీవారి భ‌క్తుల‌కు తిరుమ‌ల కొండ‌కు చేరుకొనేందుకు మరో మార్గం సిద్దం అవుతోంది. తిరుప‌తి నుండి తిరుమ‌ల‌కు చేరుకొనేందుకు కొత్త దారి వేసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్దం అవుతున్నాయి. భ‌క్తుల సంఖ్య పెరిగిన స‌మ‌యంలో..కొండ చ‌రియ‌లు విరిగిప‌డే కాలంలోనూ ఈ కొత్త మార్గాన్ని ఉప‌యోగించే లక్ష్యంగా ప్లాన్ సిద్దం చేస్తున్నారు. ఈ రోడ్డును 2.1 కిలో మీట‌ర్ల మేర నాలుగు వ‌ర‌స‌లుగా నిర్మించాల‌ని ప్ర‌తిపాదించారు.

Alternate Road from Tirupati to Tirumala suuvery completed : TTD Board to be accept..

దీనిపై చెన్నై ఐఐటీ నిపుణుల పర్యవేక్షణలో ఎల్‌అండ్‌టీ కంపెనీ సర్వే చేసింది. నివేదికను మరోవారంలో తితిదే ఇంజినీరింగ్‌ విభాగానికి అందించనుంది. ప్ర‌స్తుతం ఉన్న మార్గం 13వ కిలో మీట‌రు వ‌ద్ద నుండి కొండ చ‌రియ‌లు విరిగిప‌డే ప్ర‌దేశాలు ఉన్నాయి. ఈ మార్గంలో భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉన్న స‌మ‌యంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని మ‌రో మార్గం ఏర్పాటు పైన దృష్టి సారించారు.

25కోట్ల ఖ‌ర్చు అంచ‌నాతో..
తిరుమ‌ల కొండ మీద‌కు వెళ్లే రెండు మార్గాల‌ను అనుసంధానించే లింకు రోడ్డు నుండి ఈ కొత్త మార్గం మొద‌లు పెట్ట‌నున్నారు. ఈ రోడ్డు నిర్మాణం ద్వారా పెద్ద‌గా మ‌లుపులు లేకుండానే సాఫీగా వెళ్లేలా స‌మాంత‌రంగా రోడ్డ‌ను నిర్మాణం చేయ‌వ‌చ్చ‌ని స‌ర్వేలో సంస్థ ప్ర‌తిపాదించింది. మోకాలి ప‌ర్వ‌తం..రెండో ఘ‌ట్ రోడ్డును అనుసంధానం చేస్తూ ఈ రోడ్డు తిరుమ‌ల జీఎన్‌సీ టోల్ గేట్ వ‌ద్ద క‌లుస్తుంది. ఈ రోడ్డు నిర్మాణం కోసం 25కోట్లు ఖ‌ర్చు అవ‌స‌ర‌న‌మి ప్రాధ‌మికంగా తేల్చారు.

Alternate Road from Tirupati to Tirumala survey completed : TTD Board to be accept..

ఎల్అండ్‌టీ సంస్థ ప్రతిపాదించిన ఈ నివేదిక‌ను కొత్త ప్ర‌భుత్వం ఏర్పాట‌యిన త‌రువాత పాల‌క వ‌ర్గం చ‌ర్చించి ఆమొద ముద్ర వేయాల్సి ఉంటుంది. ఆమోదం ల‌భిస్తే ప‌నులు ప్రారంభం అవుతాయ‌ని అధికారులు చెబుతున్నారు. ఈ మార్గం అందుబాటులోకి రావ‌టం ద్వారా భ‌క్తుల‌ను ప్ర‌యోజ‌న క‌రంగా ఉంటుంద‌ని అధికారులు స్ప‌ష్టం చేసారు.

English summary
TTD Planning for alternate route from Tirupati to Tirumala in addition to present route. L&T conducted survey and submitted report to TTD Board. After new govt formation in AP the survey report comes into action.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X