ఇక ఏడుకొండల బాట..! నేడు శ్రీవారిని దర్శించుకోనున్న వైసీపి చీఫ్ జగన్..!
తిరుమల : వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మహా క్రతువు ముగిసింది. సుధీర్గ ప్రజా సంకల్ప పాదయాత్ర నిన్నటితో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముడిసింది. అత్యంత జన వాహిని ముందు జగన్ తన పాదయాత్రను ముగిస్తున్నట్టు ప్రకటించారు. ఇక నేడు తిరుమల శ్రీవారిని సందర్శించుకుని తన మొక్కును చెల్లించుకోబోతున్నారు వైసీపి అదినేత జగన్ మోహన్ రెడ్డి.
తిరుమల వెంకన్న దర్శనం తర్వాత రెండు రోజుల విశ్రాంతి అనంతరం మళ్లీ బస్సు యాత్రపై జగన్ పార్టీ ముఖ్యనేతలో సమీక్ష నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. పాదయాత్రలో కవర్ చేయలేని సుమారు 70కి వైగా నియోజక వర్గాలను జగన్ బస్సు యాత్ర ద్వారా పర్యటిస్తారని పార్టీ వర్గాలు నిర్ధారిస్తున్నాయి.

సుదీర్ఘ పాదయాత్ర ముగించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో నిన్న ప్రజా సంకల్ప పాదయాత్ర ముగించిన జగన్ అక్కడి నుంచి నేరుగా తిరుమల వెంకటేశ్వరుని దర్శనానికి బయలుదేరారు. రైలు మార్గంలో ఈ రోజు ఉదయం రేణిగుంట రైల్వే స్టేషన్ కు చేరుకోనున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అలిపిరి చేరుకుని కాలి నడకన తిరుమల చేరుకోనున్నారు.
సామాన్య భక్తుల దారిలోని మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీర్వచనాలు తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఈ రాత్రికి తిరుమలలోనే బస చేసి రేపు ఉదయం బయలుదేరి పులివెందుల వెళతారు. ఆ తరవాత హైదరాబాద్ లోటస్ పాండ్ కు జగన్ చేరుకో బోతున్నట్టు తెలుస్తోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications