TTD: చిక్కిన మరో చిరుత, ఆపరేషన్ కంటిన్యూ - టీటీడీ తాజా నిర్ణయాలు..!!
Tirumala: తిరుమలలో బోనులో మరో చిరుత చిక్కింది. ఇటీవల ఓ చిరుత చిక్కగా.. తాజాగా, గురువారం ఉదయం మరో చిరుత బోనులో చిక్కింది. నామాలగవి దగ్గర చిరుతను అధికారులు బంధించారు. చిరుతల సంచారంతో నడకమార్గంలో టీటీడీ ఆంక్షలను కొనసాగిస్తోంది. గత వారం నడకమార్గంలో వెళ్తున్న ఆరేళ్ల చిన్నారి లక్షితను చిరుత బలి తీసుకోవటంతో కలకలం మొదలైంది. దీంతో టీటీడీ అధికారులు ఆపరేషన్ చిరుత ప్రారంభించారు.
నాలుగు రోజుల్లో రెండో చిరుత:తిరుమలలో నడక మార్గంలో ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. రోజుల కిందట నరసింహస్వామి ఆలయం దగ్గర్లోనే ఏర్పాటు చేసిన బోనుకు చిరుత చిక్కింది. శేషాచలం అడవుల్లో దాదాపు 40కు పైగా చిరుతలు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు.

వీటిలో దాదాపు పది చిరుతలు మెట్ల మార్గానికి సమీపంలోకి వస్తున్నాయి.చిన్నారి లక్షిత ఉదంతం తర్వాత అటవీ శాఖ అప్రమత్తమైంది. మెట్ల మార్గానికి ఇరువైపులా దాదాపు 500కెమెరాలను చిరుతల కదలికలు గుర్తించేందుకు వినయోగించారు. మోకాలి మిట్ట దగ్గర మరో ట్రాప్, మొదటి ఘాట్‌రోడ్డు 35వ మలుపు దగ్గర కూడా ఒక బోన్ ఏర్పాటు చేశారు. అందులో ఒక బోన్ లోఈ ఉదయం మరో చిరుత చిక్కింది.
కొనసాగుతున్న ఆంక్షలు:నాలుగు రోజుల వ్యవధిలో తిరుమల నడక మార్గంలో రెండు చిరుతలను అధికారులు బంధించారు. రెండు రోజుల క్రితం మెట్ల మార్గంలో ఎలుగుబంటి సంచారంతో భక్తుల్లో ఆందోళన వ్యక్తం అయింది. దీంతో, నడక మార్గంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. 15 ఏళ్లలోపు పిల్లలు గల తల్లిదండ్రులను ఉదయం 5 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడక మార్గాల్లో అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఆదివారం నుండే ఈ నిర్ణయం అమలవుతోంది. అదేవిధంగా రెండు ఘాట్ రోడ్లలో సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలుపుదల చేసింది. నడక మార్గంలో వెళ్లే వారికి చేతి కర్రలను అందిస్తోంది.

టీటీడీ కీలక నిర్ణయాలు:లక్షితను చిరుత బలి తీసుకోవటంతో భక్తుల్లో ఆందోళన మొదలైంది. దీంతో, భక్తుల రక్షణకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఛైర్మన్ భూమన వెల్లడించారు. ఇందు కోసం నడక దారి మార్గంలో భక్తులు అందుబాటు లో ఉన్న దివ్య దర్శనం విధానంలోనూ మార్పులు తీసుకొచ్చారు. అలిపిరి వద్ద పొందే దివ్యదర్శనం టోకెన్లు గాలి గోపురం వద్ద స్కానింగ్ నుంచి మినహాయించారు.
దివ్య దర్శనం టోకెన్లు పొందిన వారు మెట్ట మార్గం లో లేదా రోడ్డు మార్గంలో అయినా వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకొనే విధంగా వెసులుబాటు కల్పించారు. నడకమార్గంలో మరో మూడు చిరుతలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వాటిని పట్టుకొనేందుకు ఆపరేషన్ చిరుత కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications