తిరుమల శ్రీవారి సేవలో జాన్వీ
తిరుపతి: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉంటోన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారుగా ఏడు గంటల సమయం పడుతోంది. ఆదివారం స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య భారీగా కనిపించింది. మొత్తంగా 82,398 మంది భక్తులు వేంకటేశ్వర స్వామివారిని దర్శించారు. వారిలో 30,076 మంది తలనీలాలను సమర్పించారు. మొక్కులు చెల్లించారు. హుండీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి 4.40 కోట్ల రూపాయల ఆదాయం లభించింది.
ప్రస్తుతం తిరుమలలో తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవాల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బుధ, గురువారాల్లో ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ముక్కోటి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని తుంబురు తీర్థానికి బుధవారం తెల్లవారు జామున 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, గురువారం తెల్లవారు జామున 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులకు అనుమతిస్తారు. పాపవినాశనం డ్యామ్ వద్ద అల్పాహారం, అన్నప్రసాదాలను అందించనున్నారు.

తుంబురు తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సి ఉన్నందున గుండె, శ్వాస కోస సమస్యలు, స్థూలకాయం ఉన్నవారికి అధికారులు అనుమతి ఇవ్వట్లేదు. ఇందులో పాల్గొనే వారి కోసం ముందు జాగ్రత్త చర్యగా ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. పోలీసు, అటవీ, టీటీడీ విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుంచి తుంబురు తీర్థం వరకు దారి పొడవునా భద్రతా సిబ్బందిని మోహరించనున్నారు.
తిరుమలలో దర్శనమిచ్చిన జాన్వీ కపూర్..!!#JahnviKapoor #TirumalaNews #TirumalaTirupati #TirumalaTirupatiDevashtanams #Oneindiatelugu pic.twitter.com/mBTRtd51sD
— oneindiatelugu (@oneindiatelugu) April 3, 2023
కాగా- బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఇవ్వాళ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ తెల్లవారు జామున వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రస్తుతం ఆమె తెలుగులో జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ మూవీకి సైన్ చేశారు. కిందటి నెల 31వ తేదీన ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. జూనియర్ ఎన్టీఆర్‌కు ఇది 30వ సినిమా. జాన్వీ కపూర్ నటించబోయే తొలి తెలుగు మూవీ ఇదే. ఎన్టీఆర్, జాన్వీకపూర్‌పై చిత్రీకరించిన తొలి షాట్‌కు ఎస్‌ఎస్ రాజమౌళి క్లాప్ కొట్టారు.












Click it and Unblock the Notifications