CJI NV Ramana: తిరుమల శ్రీవారిని దర్శించిన చీఫ్ జస్టిస్: దేవదేవుడి సేవలో కుటుంబం

తిరుపతి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ తెల్లవారు జామున కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య తిరుమలేశుడి దర్శన భాగ్యాన్ని కలిగించారు. అనంతరం ఆయన తిరుచానూరుకు బయలుదేరి వెళ్తారు. పద్మావతీ అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి వెళ్తారు.

వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి గురువారం రాత్రే ఆయన తిరుమలకు చేరుకున్నారు. ఆ కొద్దిసేపటికే శ్రీవారి ఏకాంత సేవలో పాల్గొన్నారు. అనంతరం పద్మావతి అతిథిగృహంలో బస చేశారు. ఈ తెల్లవారు జామున జస్టిస్ ఎన్వీ రమణ మరోమారు శ్రీవారి సేవలో కుటుంబ సభ్యులతో సహా కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా ఆయనకు ఇస్తిఫాకల్ స్వాగతం పలికారు.

 CJI NV Ramana along with family offered prayers at the Lord Venkateswara temple at Tirumala

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తిరుపతి శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి, ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు.. జస్టిస్ ఎన్వీ రమణకు స్వాగతం పలికారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం వెలుపలికి వచ్చిన ఆయనకు రంగనాయకుల వారి మండపంలో శ్రీవారి శేషవస్త్రాన్ని అందజేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు, ఛాయాచిత్రాన్ని ఇచ్చారు.

పద్మావతి అతిథిగృహంలో బస చేసిన అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ.. తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుచానూరుకు బయలుదేరి వెళ్తారు. పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు. తెలంగాణ గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్‌లో ఎన్వీ రమణ బస చేస్తారు. ఈ సందర్భంగా కొందరు ప్రముఖులు ఆయనను కలుస్తారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+