శ్రీవారి సేవలో వైఎస్ జగన్: ఈ రెండు జిల్లాల్లో పర్యటన: 77 చెరువులకు సుజల స్రవంతి
తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో పండగ వాతావరణం నెలకొంది. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారిని దర్శించడానికి వచ్చే భక్తుల తాకిడి మొదలైంది. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తిరుమలకు చేరుకుంటోన్నారు. నడక మార్గాలన్నీ రద్దీగా మారుతున్నాయి.
ఆదివారం 77,441 మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 29,816 మంది తలనీలాలను సమర్పించారు. టీటీడీకి హుండీ ద్వారా 3.85 కోట్ల రూపాయల ఆదాయం అందింది. సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు స్వామివారి దర్శనానికి స్వామివారి దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తిరుమలను సందర్శించారు. సోమవారం ఆయన తిరుమలకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలనను సమర్పించారు. తిరుపతిలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.
శ్రీనివాస సేతు ఫ్లైఓవర్, ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ భవనాన్ని ప్రారంభించారు జగన్. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తిరుమలకు చేరుకున్నారు. కొత్తగా నిర్మించిన వకుళామాత రెస్ట్ హౌస్, రచన రెస్ట్ హౌస్‌లు ప్రారంభించారు.
శ్రీబేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద సీఎం శ్రీ వైయస్.జగన్‌కు పట్టువస్త్రంతో పరివట్టం కట్టిన తిరుమల తిరుపతి దేవస్ధానం అర్చకులు
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 18, 2023
శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి... శ్రీ స్వామి వారిని దర్శనం చేసుకున్న సీఎం వైయస్.జగన్. pic.twitter.com/id7Ed2FkMN
అనంతరం శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. పెద శేష వాహన సేవలో పాల్గొన్నారు. రాత్రి పద్మావతి అతిథి గృహంలో బస చేశారు వైఎస్ జగన్. ఈ తెల్లవారు జామున శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీరంగనాయకులవారి మండపంలో టీటీడీ అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు పలికారు.
శ్రీవారి శేషవస్త్రాన్ని బహూకరించారు. తీర్థప్రసాదాలను అందజేశారు. ఆ సమయంలో వైఎస్ జగన్ వెంట పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా, టీటీడీ బోర్డు ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, పాలక మండలి సభ్యులు, అర్చకులు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ ఛైర్మన్ భూమన అభినయ్ రెడ్డి ఉన్నారు.
శ్రీవారి తీర్ధప్రసాదాలు, స్వామివారి చిత్రపటం సీఎంకు అందజేసిన వేదపండితులు. pic.twitter.com/jwm0qENes1
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 18, 2023
అనంతరం వైఎస్ జగన్.. కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు జిల్లాకు బయలుదేరి వెళ్తారు. ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కృష్ణగిరి మండలం లక్కసాగరం చేరుకుంటారు.
రంగనాయకుల మండపంలో 2024 తిరుమల తిరుపతి దేవస్ధానం డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. pic.twitter.com/gCi3zXpSgl
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 18, 2023
డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాలకు మంచినీరు, సాగునీటిని సరఫరా చేసే పథకాలను వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. ఆయా నియోజకవర్గాల్లోని 77 చెరువులకు హంద్రీ- నీవా సుజల స్రవంతి కాలువ నుంచి నీటిని విడుదల చేస్తారు. సుజల స్రవంతి నీటితో ఆ చెరువులను నింపడానికి ఉద్దేశించిన పథకం ఇది. అనంతరం డోన్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications