Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం..

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా ఉంది. శనివారం సాయంత్రానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లలో నిండిపోయి శిలాతోరణం వరకు క్యూ లైన్ లో వేచి చూస్తున్నారు. వీరు శ్రీవారి దర్శనం చేసుకునేందుకు 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు నీరు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు.

మరి కొద్ది రోజుల్లో వేసవి సెలవులు ముగియడంతో పాటు పాఠశాలలు, కాలేజీలు త్వరలో ప్రారంభ కాబోతున్నాయి. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వస్తున్నారు. దర్శనం టిక్కెట్లు లేని భక్తులకు స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి 36 గంటల సమయం పడుతోందని శుక్రవారం ఉదయం టీటీడీ అధికారులు తెలిపారు. గురువారం అర్దరాత్రి వరకు తిరుమలలో శ్రీ వెకంటేశ్వరస్వామిని 74, 583 మంది దర్శించుకున్నారు.

 Tirumala

40, 343 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకునిన మొక్కులు తీర్చుకున్నారు. హుండీలో రూ. 3. 37 కోట్లు ముడుపులు సమర్పించుకున్నారు. శుక్రవారం శ్రీవారిని 79,486 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.3.72 కోట్లు హుండీ కానుకలు లభించాయి. 40,250 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు భారీగా పెరగడంతో గదులు దొరకడం కూడా ఇబ్బందిగా మారింది. భక్తుల సంఖ్య భారీగా ఉండడంతో
తిరుమలలో ఉన్న మరుగుదోడ్లు, క్యూకాంప్లెక్స్ ల్లో ఉన్న మరుగుదోడ్లు, బాత్ రూమ్ లను సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు.

వచ్చే 15 రోజులు కూడా తిరుమలకు వచ్చే భక్తులు పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కాగా తిరుమలలో భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఇటీవల ఖమ్మంకు చెందిన ఓ భక్తుడు రహస్యంగా శ్రీవారం ఆలయం ఆవరణంలో వీడియో తీశాడు. దీంతో టీటీడీ భద్రతను పెంచింది. ఆధునిక టెక్నాలజి సాయంతో తిరుమలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామని రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. సీసీటీవీ కంట్రోల్ రూమ్ లో కృత్రిమ మేధను ఎలా వినియోగించాలి, ఎలాంటి సాఫ్ట్ వేర్లు ఉపయోగించాలి అనే అంశాలపై అధ్యయనం చేస్తామని హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+