తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నవనీత సేవ స్టార్ట్.. ఎలక్ట్రిక్ బస్సులు కూడా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

|
Google Oneindia TeluguNews

శ్రీకృష్ణాష్టమి పర్వదినం‌ సందర్భంగా తిరుమలలో నవనీత సేవ ప్రారంభించారు. 33 ఏళ్ళ క్రితం టీటీడీ అష్టదళ పాదపద్మారాధన సేవను ప్రారంభించిన సంగతి తెలిసిందే. శ్రీకృష్ణాష్టమి రోజున నవనీత సేవ ప్రారంభించడం మన అందరి అదృష్టంగా భావిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారడ్డి పేర్కొన్నారు. గోఆధారిత నైవేద్యం, గోపూజ, గుడికో, గోమాత వంటి కార్యక్రమాలతో పాటు నవనీత సేవ ఘట్టం కలియుగం ఉండే వరకు సాగాలని శ్రీవారిని కోరుకుంటున్నామని ఆయన ఈ మేరకు తెలిపారు.

గతంలో ఫ్యాక్టరీ నుంచి తెచ్చిన పాలలోని వెన్నను శ్రీవారికి సమర్పించే వాళ్ళం అని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. చిన్ని కృష్ణుడు నవనీతాన్ని తయారు చేసిన విధంగా ప్రస్తుతం వెన్న తయారీ టీటీడీ గోశాలలో ఉత్పత్తి అయ్యే విధంగా చర్యలు తీసుకున్నాం అని వివరించారు. పేడ పిడకల మంటల్లో పాలను వేడి చేసి పెరుగుగా పేరపెట్టి వెన్న చిలికే కార్యక్రమం నిర్వహిస్తున్నాం అని తెలిపారు. వెన్న చిలికే కార్యక్రమాన్ని ప్రతి నిత్యం జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం అని పేర్కొన్నారు.

electric buses use for staff and devotees

తిరుమల పవిత్రతను కాపాడాలంటే పచ్చదనాన్ని పరిరక్షించాలని కోరారు. అందుకోసమే వాయుకాలుష్య నివారణ చర్యలు తీసుకున్నామని వివరించారు.తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సులతో ఉద్యోగులు, భక్తులు వచ్చేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. భక్తుల మనోభావాలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ తెలిపారని వివరించారు. ఫేస్ వన్ లో 35 ఎలక్ట్రిక్ వాహనాలు సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో కొనుగోలు చేశామన్నారు. .పేస్ టూ లో ఉచిత బస్సులను సైతం ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చుతాం అని సంకేతాలను ఇచ్చారు.

electric buses use for staff and devotees

ఫేస్ త్రిలో ఆర్టీసీ బస్సులను సైతం ఎలక్ట్రికల్ బస్సులుగా తీర్చి దిద్దే ప్రయత్నం చేస్తాం అని సుబ్బారెడ్డి అన్నారు. వంద బస్సులను తిరుమల తిరుపతి మధ్య నడిపేందుకు సీఎం జగన్ అంగీకరించారని వివరించారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ఇతర ప్రభుత్వ అధికారులు ఎలక్ట్రికల్ వాహనాన్ని వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాహనాలు విరాళంగా ఇవ్వదలచిన దాతలు,ఎలక్ట్రిక్ వాహనాలు ఇవ్వాలని కోరుతాం అని చెప్పారు. మూడు దశలు పూర్తి అయినా అనంతరం తిరుమలలో నడిచే టాక్సీలను కూడా ఎలక్ట్రికల్ వాహనాలుగా మార్చుతాం అని పేర్కొన్నారు.

electric buses use for staff and devotees

Recommended Video

Talibans ఆశ్చర్యపరిచారు.. ఇండియన్ ఆర్మీ సిద్దం.. Bipin Rawat వార్నింగ్ || Oneindia Telugu

ఎలక్ట్రిక్ టాక్సీ వాహనాలకు ఫైనాన్సియల్‌గా బ్యాంకు నుంచి లోన్ తీసిచ్చే కార్యక్రమం చేస్తాం అని వివరించారు. త్వరలో సర్వదర్శనం టోకెన్లను జారీ చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పారు. ఉన్న టైం స్లాట్‌లో 20% శాతం సర్వ దర్శన టోకెన్స్ జారీ చేసేలా చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. మరో మూడు రోజుల్లో సర్వదర్శనం టోకెన్స్ విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటికే కేసులు పెరుగుతున్నాయని.. వాటిని దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

English summary
electric buses use for staff and devotees ttd chairman yv subba reddy said to media
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X