ఒకే వేదికపై చంద్రబాబు-కిరణ్ కుమార్ రెడ్డి: పాత మిత్రుడితో మంతనాలపై
తిరుపతి: ప్రముఖ నటుడు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోహన్ బాబు నిర్మిస్తోన్న షిర్డీ సాయినాథుని ఆలయ నిర్మాణం పూర్తయింది. శ్రావణ మాసంలో ఈ ఆలయాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించడానికి ఆయన సన్నాహాలు చేస్తోన్నారు. వచ్చే నెలలో మూడు రోజుల పాటు యజ్ఞ యాగాదులను నిర్వహించనున్నారు. 9,10,11 తేదీల్లో ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి. 11వ తేదీన సాయినాథుడి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఉంటుంది.

ఆ పనుల్లో బీజీగా..
ప్రస్తుతం ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన తలమునకలై ఉన్నారు. తిరుపతి సమీపంలోని రంగంపేట క్రాస్ వద్ద మోహన్ బాబుకు చెందిన శ్రీ విద్యానికేతన్, యూనివర్శిటీ పరిసరాల్లోనే ఈ ఆలయం నిర్మితమైంది. ప్రారంభోత్సవానికి ఆహ్వానితులను కలుస్తోన్నారు. ఇప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఆహ్వానించారు.

చంద్రబాబుతో భేటీ..
తన కుమార్తె, నిర్మాత-నటి మంచు లక్ష్మీతో కలిసి చంద్రబాబు ఇంటికి వెళ్లారు. సుమారు గంటపాటుకు పైగా చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. కాగా- సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరవుతానంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ భేటీ తరువాత ఒక్కసారిగా పుకార్లు వెల్లువెత్తాయి. తెలుగుదేశం పార్టీలో మోహన్ బాబు చేరబోతోన్నారని, అందుకే ఆయన చంద్రబాబును కలిశారనే వార్తలొచ్చాయి.

విగ్రహ ప్రతిష్ఠాపన కోసం..
దీన్ని మోహన్ బాబు తోసిపుచ్చారు. అసలు కారణాన్ని వెల్లడించారు. కాగా అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి, చిత్తూరు జిల్లాకే చెందిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా మోహన్ బాబు ఆహ్వానించారు. ఆయన ఆహ్వాన పత్రాన్ని పంపించారు. సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. 11వ తేదీన నిర్వహించే సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కావాలంటూ సూచించారు. దీనికి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు-కిరణ్ కుమార్ రెడ్డి..
అదే వాస్తవమైతే మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు-కిరణ్ కుమార్ రెడ్డి ఒకే వేదిక మీదికి వచ్చినట్టవుతుంది. రాష్ట్ర విభజన సమయంలో వారిద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా, చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా.. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా చంద్రబాబు ఓటు వేయడం అప్పట్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

వైఎస్ జగన్‌కూ ఆహ్వానం..
ఇదే కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా మోహన్ బాబు ఆహ్వానించే అవకాశాలు లేకపోలేదు. త్వరలోనే ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలుస్తారని తెలుస్తోంది. వైఎస్ జగన్ హాజరు కాలేకపోతే ఆయన తరఫున మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆర్ కే రోజా, తిరుపతి, చంద్రగిరి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు లేకపోలేదు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications