తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు శుభవార్త
తిరుమల గిరులపై కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులందరికీ ఒక ముఖ్యమైన గమనిక. ఆర్టీసీ ప్రయాణికుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం రూ.300 టికెట్ల కోటాను 1000కి పెంచారు. 300 కిలోమీటర్ల దూరానికి పైబడిన నగరాల నుంచి వచ్చే బస్సులకు 80 శాతం టికెట్లు కేటాయించగా, 300 కిలోమీటర్ల లోపు నగరాల నుంచి వచ్చే బస్సులకు 20 శాతం కేటాయించారు.
ప్రయాణంతోపాటు స్వామివారి దర్శనం టికెట్ ను నెలరోజులు ముందుగానే బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారి తెలిపారు.ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 15వ తేదీ నుంచి అక్టోబరు 7వ తేదీ వరకు ప్రయాణ టికెట్లతోపాటు దర్శన టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చని వివరించారు. తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నవారు అధికారిక వెబ్‌సైట్ www.apsrtconline.in లో అదనపు కోటా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

తిరుమల నడక దారిలో చిరుతల సంచారంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీవారి దర్శనం కోసం కాలినడకన వచ్చే భక్తులకు ఎలాంటి అపాయం కలగకుండా వారి ప్రాణరక్షణే ధ్యేయంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో టీటీడీ ఈవో, ఎస్పీ, అటవీ శాఖ, జిల్లా జాయింట్ కలెక్టర్ ఇతర అధికారులు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తుల రక్షణకు అటవీ శాఖ ఆధ్వర్యంలో నిపుణులైన అటవీ సిబ్బందిని నియమించుకోవాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications