Tirumala: తిరుమలలో మరోసారి చిరుతల సంచారం..
తిరుమలలో మరోసారి చిరుతలు కలకలం సృష్టించాయి. సోమవారం అలిపిరి నడకదారిలో ఆఖరు మెట్టు దగ్గర రెండు చిరుతలు కనిపించాయి. దీంతో భక్తులు వెంటనే గట్టిగా కేకలు వేశారు. భయపడిన చిరుతలు పారిపోయాయి. విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
భక్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు టీటీడీ అధికారులు భక్తులను గుంపులు గుంపులుగా కొండపైకి నడకదారిలో పంపుతున్నారు. చిరుతలను పట్టుకునేందుకు ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగారు. గతంలో కూడా చిరుతలు నడక మార్గంలో కనిపించాయి. కొద్ది నెలల క్రితం చిన్నారి దాడి చేసి చంపాయి. దీంతో తిరుమల మెట్ల మార్గంలో భక్తులు భయపడుతూ పైకి వెళ్లారు. టీటీడీ భక్తులకు కర్రలు కూడా ఇచ్చింది.

మరోవైపు అటవీ సిబ్బంది నాలుగైదు చిరుతలను బంధించి అడవిలో వదిలి పెట్టారు. అయితే తాజాగా చిరుతలు మరోసారి కనిపించడం భక్తులు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications