Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముఖ్యమంత్రి అనూహ్య నిర్ణయం: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వెంటనే వెల్లడి: కేబినెట్‌లో తీర్మానం

తిరుపతి: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. భార్య సాధనా సింగ్ చౌహాన్‌తో కలిసి ఆయన తిరుమలకు చేరుకున్నారు. ఈ తెల్లవారు జామున వీఐపీ బ్రేక్ దర్శనం సందర్భంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకోవడానికి శివరాజ్ సింగ్ చౌహాన్ దంపతులు మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. ఈ తెల్లవారు జామున స్వామివారిని దర్శించుకున్నారు.

అనంతరం సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు. బేడీ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ సభ్యుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కేఎస్ జవహర్ రెడ్డి, ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి తదితరులు చౌహాన్ దంపతులకు శ్రీవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకుని అతిథిగృహానికి చేరుకున్నారు.

Madhya Pradesh CM Shivraj Singh Chouhan visits Tirumala and announced Cow Cabinet

ఆ కొద్ది సేపటికే శివరాజ్ సింగ్ చౌహాన్ అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లో గోవుల సంక్షేమానికి కొత్తగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కీలక శాఖలకు భాగస్వామ్యాన్ని కల్పించారు. పశు సంవర్ధకం, అటవీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, హోమ్, రైతాంగ సంక్షేమ శాఖలను ఇందులో ఈ కౌ కేబినెట్‌లో భాగస్వామ్యాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ నెల 22వ తేదీన తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించబోతున్నానని, గోవుల సంక్షేమ శాఖపై ఇందులో తీర్మానం చేస్తామని అన్నారు. 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు అగర్ మల్వా గోవుల అభయారణ్యంలో గల గోపష్టమిలో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించ తలపెట్టినట్లు వెల్లడించారు. మధ్యప్రదేశ్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా తనకు మద్దతు ఇస్తోన్న ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చారు. భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించారు.

ఫలితంగా- కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్‌లో ఇటీవలే నిర్వహించిన 28 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. ఆయన ప్రభుత్వానికి అవసరమైన మెజారిటీ సభ్యుల సంఖ్య చేకూరింది. దీనితో తొలిసారిగా ఆయన చాలాకాలం తరువాత తొలిసారిగా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+