తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నీట మునిగిన తిరుపతి: మల్లెమడుగు రిజర్వాయర్ గేట్లు ఎత్తివేత

|
Google Oneindia TeluguNews

తిరుపతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దెబ్బకు దక్షిణాదిన మూడు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. వాయుగుండం తీరం దాటిన తరువాత కూడా దాని తీవ్రత కొనసాగుతుందని అంచనా వేస్తోన్నారు. రాజధాని చెన్నై ఇప్పటిే నీట మునిగింది. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.

కర్ణాటకపైనా అల్పపీడన ప్రభావం తీవ్రంగా ఉంది. బెంగళూరులో మూడురోజులుగా ఏకధాటిగా వర్షం కురుస్తోంది. బెంగళూరు రూరల్, మంగళూరు, చామరాజనగర, కోలార్, చిక్‌బళ్లాపుర జిల్లాలపై అల్పపీడన ప్రభావం పడింది. బెంగళూరు రూరల్ జిల్లాకు వాతావరణ కేంద్రం అధికారులు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేశారు. ఏపీలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ ఉండట్లేదు. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.

Mallemadugu reservoir near Tirupati, gates open due to the reach FTL due to the heavy rains

ప్రత్యేకించి నెల్లూరు, చిత్తూరు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలకు సెలవు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో తీర ప్రాంత గ్రామాల్లో అధికారులు పర్యటించారు. మత్స్యకార గ్రామాల వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు.

చంద్రగిరి సమీపంలోని అమ్మ చెరువు ప్రమాదకరస్థితికి చేరింది. స్థానికులను అధికారులు అప్రమత్తం చేశారు. తిరుపతిలోని మాధవ్ నగర్ మరోసారి నీట మునిగింది. వర్షపు నీరు ఇళ్లలోకి ప్రవేశించింది. తిరుపతి సమీపంలోని మల్లెమడుగు రిజర్వాయర్ వరద నీటితో పోటెత్తింది.
ఇన్‌ఫ్లో భారీగా ఉంటోంది. శేషాచలం అడవులు, సప్తగిరుల నుంచి వరద నీరు మల్లెమడుగు రిజర్వాయర్‌కు ఉరకలు వేస్తోంది. ఇన్ ఫ్లో అధికం కావడంతో రిజర్వాయర్ నిండింది.

Recommended Video

Weather : Heavy Rains Till Oct 17 Due To Low Pressure || Oneindia Telugu

దీనితో ఈ రిజర్వాయర్‌కు చెందిన తొమ్మిది గేట్లను అధికారులు ఎత్తివేశారు. వరద నీటిని దిగువకు వదిలి వేస్తోన్నారు. 3,500 క్యుసెక్కుల నీటిని దిగువకు వదిలి వేస్తోన్నారు. ఫలితంగా వరద కాలువల్లో నీరు పొంగిపొర్లుతోంది. పరిసర ప్రాంతాల్లోని కాలనీల్లోకి ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మల్లెమడుగు రిజర్వాయర్‌కు వస్తోన్న ఇన్‌ఫ్లోను అంచనాను వేస్తూ, దానికి అనుగుణంగా నీటిని దిగువకు వదిలి వేస్తోన్నారు.

English summary
Mallemadugu reservoir near temple city Tirupati in Chittoor district gates open due to the reach Full Tank Level due to the heavy rains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X