తిరుమలలో అత్యాధునిక టెక్నాలజీతో పటిష్టమైన ఆక్టోపస్ పోలీసు దళం !

తిరుమల/తిరుపతి: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి కొలువు తీరిన ఆంధ్రప్రదేశ్ లోని తిరుమలకు ప్రతిరోజు కొన్ని వేల మంది శ్రీవారి భక్తులు వెలుతుంటారు. వీకెండ్, పండుగలు, వరుస సెలవుల సందర్బంలో ప్రతిరోజు లక్ష మందికి పైగా తిరుమల కొండ మీదకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇలాంటి తిరుమలలో భదత్రా పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

అత్యాధునిక టెక్నాలజితో తిరుమలలో పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నట్లు, ఎలాంటి భద్రతాపరమైన సమస్యనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆక్టోపస్ అదనపు ఎస్పీ నగేష్ బాబు తెలిపారు. బుధవారం పీఎసీ- 4లోని సమావేశ మందిరంలో తిరుమల అదనపు ఎస్పీ ముని రామయ్యతో కలిసి అదనపు ఎస్పీ నాగేష్ బాబు ఆక్టోపస్, పోలీస్, ఫైర్, రెవెన్యూ, వైద్య, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

 Tirumala

ఈ సందర్భంగా ఆక్టోపస్ అదనపు ఎస్పీ నగేష్ బాబు మాట్లాడుతూ తిరుమలలో తరచుగా ఇటువంటి మాక్ డ్రిల్స్ నిర్వహించడం ద్వారా భద్రత లోపాలను అధిగమించవచ్చు అన్నారు.

సంఘ విద్రోహులు తిరుమలలోని ఏదైనా ప్రదేశంపై దాడి చేసినప్పుడు ఎలా తిప్పికొట్టి భక్తులకు రక్షణ కల్పించాలి అనేది ఈ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశమని ఆక్టోపస్ అదనపు ఎస్పీ నగేష్ బాబు తెలిపారు.

ఈ విధంగా తిరుమలలోని ఒక విశ్రాంతి గృహంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తారు.

 Tirumala

ఆక్టోపస్ డీఎస్పీ నరసింహారావు సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కొనేటప్పుడు ఏ విభాగం అధికారులు, సిబ్బంది ఏ కార్యక్రమాలు నిర్వహించాలి అనే విషయమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

బుధవారం రాత్రి 8 నుండి 11 గంటల వరకు తిరుమలలోని పద్మావతి విశ్రాంతి గృహం వద్ద ఆక్టోపస్ పోలీసు దళం, నిఘా మరియు భద్రతా విభాగం, పోలీసు, సంబంధిత శాఖల సమన్వయంతో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.

 Tirumala

తిరుమలకు వెళ్లే భక్తుల వాహనాలను, భక్తులను తిరుపతిలోని అలిపిరి దగ్గర నిలిపివేసి క్షుణ్ణంగా సోదాలు చేస్తారు. ఇక తిరుమలలోని పలు ప్రాంతాల్లో అనుమానం వస్తే భక్తులను సోదాలు చేస్తుంటారు. ఇక శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్ ల్లో పలు చోట్ల సోదాలు చేస్తుంటారు. ఎలక్ట్రానిక్ వస్తులు, మొబైల్ ఫోన్ లతో పాటు నిషేదిత వస్తువులను శ్రీవారి దర్శనం చేసుకునే భక్తులు తీసుకెళ్లడానికి ఎలాంటి అవకాశం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+