రఘురామపై పెద్దిరెడ్డి ఆగ్రహాం: దమ్ముంటే రాజీనామా చేయాలి, షాతో మాట్లాడరా..?

వైఎస్ఆర్ సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రఘురామ బ్లాక్‌ షీప్‌ అంటూ ఫైరయ్యారు. కొమ్ములు లేని దున్నపోతు అని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆయనకు సిగ్గుంటే ఎంపీ పదవీకి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు.

 స్వపక్షంలోనే విపక్షంలా..

స్వపక్షంలోనే విపక్షంలా..

వైసీపీ ప్రభుత్వంపై రఘురామకృష్ణరాజు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. స్వపక్షంలోనే విపక్షంగా మారారు. సీఎం జగన్‌ను మొదలుకొని వైసీపీ నేతలపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. రఘురామ ఆరోపణలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన సందర్భాలు లేకపోలేదు. దీంతో ప్రభుత్వం నుంచి కౌంటర్ అటాక్ జరుగుతోంది. సీఎం జగన్‌ వైఖరిపై రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

షాతో మాట్లాడలేదా..?

షాతో మాట్లాడలేదా..?

పోలవరం గురించి అమిత్‌షాతో సీఎం జగన్‌ మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉంది అని రఘురామ అన్నారు. ఇది కాక ఇంకే అంశాలపై మాట్లాడారో బయటపెట్టాలని.. సీఎం అంటే పెద్ద పాలేరు. అంటే పెద్ద పాలకుడు. అంతేగానీ 'గ్రేట్‌మ్యాన్‌' అనుకుంటున్నారా? ప్రజల దాక్షిణ్యాలతోనే సీఎం అయ్యారనే వాస్తవం గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. రాజధాని విశాఖలో రావాలన్నా, సీమ సస్యశ్యామలం కావాలన్నా.. పోలవరం అవసరం అని రఘురామ అభిప్రాయపడ్డారు.

అబద్దాలు చెబుతూ..

అబద్దాలు చెబుతూ..

దీనిపై అమిత్ షాతో మాట్లాడకుండా.. మాట్లాడినట్లు అబద్ధం చెప్పి, ప్రజలను మోసం చేస్తారా అని అడిగారు. మీ వెనుక వందిమాగధులు, గోముఖ వ్యాఘ్రాలు ఉన్నాయి.. జాగ్రత్త. నేను రెడ్డిని కాను గనుక నన్ను ఎలాగూ విశ్వసించరని మరోసారి ఆరోపించారు. ఇప్పటికైనా సత్యం గ్రహించి మీ చుట్టూ ఉన్న గోముఖ వ్యాఘ్రాల పనిపట్టాలని సూచించారు. సుశిక్షితుడైన పార్టీ వ్యక్తిగా మిమ్మల్ని అప్రమత్తం చేస్తున్నానని.. తనపై ఎఫ్‌ఐఆర్‌ ఉన్నందునే బీజెపీతో దగ్గరవుతున్నట్లు ఒక పెద్దిరెడ్డి సీఎంకు చెప్పారని కామెంట్ చేశారు.

 ఇదీ తగదు

ఇదీ తగదు

సీఎం జగన్‌పై 33 చార్జిషీట్లు ఉన్నాయని చెప్పారు. ఆయన బీజెపీకి దగ్గరగా ఉన్నట్టా.. ఆ పెద్దిరెడ్డి నన్ను విమర్శిస్తూ పరోక్షంగా సీఎంను అవమానిస్తున్నారు అని రఘురామ కామెంట్ చేశారు. రఘురామకు ధీటుగా పెద్దిరెడ్డి కూడా స్పందించారు. మరీ దీనిపై రఘురాముడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+