Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుమ‌ల శ్రీ‌వారికి రికార్డు స్థాయిలో ఆదాయం...

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు ప్ర‌తి నిత్యం భ‌క్తులు వెళ్తుంటారు. దేశంలోని ఎక్క‌డా లేని విధంగా తిరుమ‌లలో భ‌క్తుల ర‌ద్దీ నిత్యం ఉంటుంది. తిరుమ‌ల శ్రీ‌వారికి మరోసారి కాసుల వర్షం కురిసింది. చాలా రోజుల తర్వాత రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింద‌ని తిరుమ‌ల తిరుపతి దేవ‌స్థానం అధికారులు వెల్ల‌డించారు. ఆదివారం ఒక్క‌రోజు మాత్ర‌మే ఏకంగా రూ.5.04 కోట్ల ఆదాయం వచ్చిందంటే ఇక్క‌డ భ‌క్తుల ర‌ద్దీ ఎంత ఎక్కువ‌గా ఉందో మ‌న‌కు అర్థం అవుతుంది.

జ‌న‌వ‌రిలో ఇదే టాప్ రికార్డ్ స్థాయి ఆదాయ‌మ‌ని అధికారులు తెలిపారు. ఇక‌, గ‌త‌నెల అంటే డిసెంబ‌ర్ 2023లో కూడా శ్రీ‌వారి ఆదాయం రూ.5 కోట్ల మార్క్‌ను అందుకుంది. తొలిసారి జ‌న‌వ‌రి నెలలో ఆ రికార్డును చేరుకుంది. శుక్ర‌వారం నుంచి వ‌రుస‌గా సెల‌వులు రావ‌డంతో తిరుమలలో భక్తుల రద్దీ విప‌రీతంగా పెరిగింది. వరుస సెలువుల కారణంగా కొండపై ఒక్కసారిగా భ‌క్తుల రద్దీ పెరిగింది.

Record income for Tirumala Temple..

ఇదిలా ఉండ‌గా, ఒక్క ఆదివారం మాత్ర‌మే తిరుమల వెంక‌టేశ్వ‌ర‌స్వామివారిని మొత్తం 85,142మంది భక్తులు దర్శించుకున్నారు. ఒక్క‌రోజు స్వామి వారికి ఆదాయం రూ.5.04 కోట్లు వచ్చింది. ఇందులో 22,064మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవ‌డం జ‌రిగింది. మొత్తం 21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ క‌ట్టారు. ఇక‌, సర్వదర్శనం స్లాట్ టోకెన్లు లేని భక్తులకు మాత్రం స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ప‌న్నెండు గంటల సమయం పడుతోంది.

శుక్ర‌వారం నుంచి వ‌రుస సెల‌వుల‌తో తిరుమలలో భక్తుల రద్దీ విప‌రీతంగా పెరిగింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి షెడ్లు భ‌క్తుల‌తో పూర్తిగా నిండిపోయాయి. ఇక‌, తిరుమ‌ల‌ స్వామివారి సర్వదర్శనానికి దాదాపు ప‌ది గంటలకుపైగా సమయం పట్టిందని ఇక్క‌డివారు చెబుతున్నారు. వ‌చ్చెనెల‌లో తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాల గురించి ఓసారి చూద్దాం..

వ‌చ్చే నెల‌లో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ప‌ర్వ‌దినాల కార్య‌క్ర‌మాలు...

ఫిబ్ర‌వ‌రి 9న శ్రీ పురంద‌ర‌దాసుల ఆరాధ‌నోత్స‌వం కార్య‌క్ర‌మంగా జ‌ర‌గ‌నుంది. మ‌రుస‌టి రోజు అంటే ఫిబ్ర‌వ‌రి 10న తిరుక‌చ్చినంబి ఉత్స‌వారంభం. ఫిబ్ర‌వ‌రి 14న వ‌సంత‌పంచ‌మి కార్య‌క్ర‌మం. ఫిబ్ర‌వ‌రి 16న ర‌థ‌స‌ప్త‌మిని నిర్వ‌హించ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 19న తిరుక‌చ్చినంబి శాత్తుమొర కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఫిబ్ర‌వ‌రి 20న భీష్మ ఏకాద‌శి సంద‌ర్భంగా స్వామివారికి ప్ర‌త్యేక పూజ కార్య‌క్ర‌మాలు చేయ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 21న శ్రీ కుల‌శేఖ‌రాళ్వార్ వ‌ర్ష తిరున‌క్ష‌త్రం కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 24న కుమార‌ధార తీర్థ‌ముక్కోటి, మాఘ పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ వంటి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+