TTD:తిరుమల భద్రతలో డొల్లతనం - భక్తుల ఆగ్రహం..!!
నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే తిరుమల శ్రీవారి ఆలయంలో భద్రతా లోపం బయటకు వచ్చింది. భద్రతలోని డొల్లతనం వెల్లడయ్యేలా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో తరచూ టీటీడీ నిఘా సిబ్బంది వైఫల్యం బయటపడుతూనే ఉంది. తాజాగా భక్తుడు ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్‌తో హాల్ చల్ చేసిన విజువల్స్ బయటకు వచ్చాయి. ఇవి ఎప్పుడు తీసారు.. ఈ ఘటన ఎలా జరిగిందనే దాని పైన అధికారులు ఆరా తీస్తున్నారు.
తిరుమలలో అడుగడుగునా భద్రత ఉంటుంది. ప్రతీ సందర్భంలోనూ నిఘా కొనసాగుతోంది. కానీ, మూడు అంచెల భద్రతను దాటి మరీ ఓ భక్తుడు మొబైల్ ఫోన్‌తో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాడు. మొబైల్ ఫోన్‌తో వెళ్లిన సదరు భక్తుడు శ్రీవారి ఆలయంలో హల్‌చల్ చేశాడు. ఆలయంలో నలువైపుల నుంచి ఆనంద నిలయాన్ని ఫోన్‌తో చిత్రీకరించాడు. అంతటితో ఆగకుండా ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆనంద నిలయం విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోలో వర్షం పడుతున్న సమయంలో ఆనంద నిలయాన్ని అతి సమీపంలో నుంచి భక్తుడు వీడియో తీసినట్లు తెలుస్తోంది. అయితే భక్తుడు శ్రీవారి ఆలయంలో ఇంకేమైనా చిత్రికరించాడా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

మొబైల్ ఫోన్ తో ఆలయ ప్రాంగణంలోకి ఎలా ప్రవేశించారనేది ఇప్పుడు అనుమానాలకు కారణమవుతోంది. అసలె ఆలయ ప్రాంగణంలోకి ఫోన్లను అనుమతించారు. భద్రతా సిబ్బంది పూర్తిగా తనిఖీ చేసిన తరువాతనే ఎవరైనా అనుమతిస్తారు. ఇప్పుడు ఆనంద నిలయం విజువల్స్ సోషల్ మీడియాలో కనిపిస్తుండటంతో ఏం జరిగిందనేది క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇంత పకడ్భందీగా భద్రత ఉన్నప్పటికీ ఓ భక్తుడు ఈ విధంగా శ్రీవారి ఆలయంలోకి సెల్‌ఫోన్‌ను తీసుకెళ్లడమే కాకుండా.. ఆనంద నిలయాన్ని వీడియోలు తీయడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని పైన ఆరా తీస్తున్న టీటీడీ అధికారులు ఈ వీడియో ఏంటనే దానితో పాటుగా పూర్తి సమాచారం అధికారికంగా వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications