తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం తొక్కిసలాట: స్పృహ తప్పిన భక్తులు; టీటీడీ కీలకనిర్ణయం

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనం టికెట్లకు భారీగా డిమాండ్ నెలకొంది. కరోనా మహమ్మారి కారణంగా స్వామివారి దర్శనం చేసుకునే భక్తులకు టికెట్ల కోసం ఆన్లైన్ లో కోటా పెట్టి శ్రీవారి దర్శనానికి వీలు కల్పిస్తోంది టీటీడీ. దీంతో స్వామివారి సర్వదర్శన టికెట్ల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లలో ఒక్కసారిగా భారీగా భక్తులు రావటంతో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో కొందరు భక్తులు అక్కడే స్పృహ తప్పి పడిపోయారు. తాజా పరిణామాలతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

టీటీడీ సర్వ దర్శనం టికెట్ల కోసం వచ్చిన భక్తుల మధ్య తోపులాట

టీటీడీ సర్వ దర్శనం టికెట్ల కోసం వచ్చిన భక్తుల మధ్య తోపులాట

తిరుపతిలో మూడు చోట్ల టిటిడి భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తోంది. టిటిడి రెండో సత్రం, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం వద్ద టోకెన్లను జారీ చేస్తున్నారు. అయితే తాజాగా కౌంటర్ల వద్ద భారీ సంఖ్యలో భక్తులు టోకెన్ల కోసం ఎదురు చూస్తున్నారు. సర్వ దర్శనం టోకెన్ల కోసం కిలోమీటర్ల మేర భక్తులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. గంటల తరబడి సర్వదర్శనం టోకెన్లు కోసం నిరీక్షించిన భక్తులు ఒక్కసారిగా కౌంటర్ వద్దకు దూసుకొచ్చే ప్రయత్నం చేసారు. దీంతో తోపులాట జరిగింది.

తొక్కిసలాటలో స్పృహ తప్పి పడిపయిన భక్తులు.. టీటీడీ పై ఫైర్

తొక్కిసలాటలో స్పృహ తప్పి పడిపయిన భక్తులు.. టీటీడీ పై ఫైర్

సర్వ దర్శనం టిక్కెట్లు కోసం వేలాది మంది ఒక్కసారిగా రావడంతో తోపులాట కాస్తా తొక్కిసలాటగా మారింది. ఈ తొక్కిసలాటలో పలువురు స్పృహ కోల్పోగా క్యూలైన్లు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. గంటల తరబడి శ్రీవారి దర్శన టికెట్ల కోసం ఎదురు చూసిన భక్తులు సొమ్మసిల్లి పడిపోవడంతో టీటీడీ ఏర్పాట్లపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన పలువురు భక్తులు తాజా పరిణామాలతో కన్నీటి పర్యంతం అవుతున్నారు. టిటిడి సరైన ఏర్పాట్లు చేయలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదు అని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్పందించని టీటీడీ విజిలెన్స్, రంగంలోకి పోలీసులు

స్పందించని టీటీడీ విజిలెన్స్, రంగంలోకి పోలీసులు

ఇదిలా ఉంటే పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో గోవిందరాజ స్వామి సత్రాల వద్ద కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీగా వచ్చిన భక్తులను కంట్రోల్ చేయడానికి పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజా తోపులాట నేపథ్యంలో టికెట్ల జారీలో టీటీడీ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న టిటిడి విజిలెన్స్ స్పందించలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. తోపులాటలో తమ పిల్లలు కొందరు కనిపించకుండా పోయారని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భక్తుల రద్దీతో వీఐపీ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ .. సాధారణ భక్తుల కోసం కీలక నిర్ణయం

భక్తుల రద్దీతో వీఐపీ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ .. సాధారణ భక్తుల కోసం కీలక నిర్ణయం

ఇక భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్లు లేకపోయినా సర్వదర్శనం కల్పిస్తామని అధికారులు వెల్లడించారు. నేరుగా భక్తులు కొండపైకి చేరుకోవాలని సూచించారు. అయితే ఇప్పటికే టికెట్లు తీసుకున్న వారి పరిస్థితి ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు టిటిడి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. బుధవారం నుండి ఆదివారం వరకు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+