తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌పై రత్నప్రభ అనూహ్య వ్యాఖ్యలు -తిరుపతి ఓటర్లకు సవాల్ -బీజేపీ తరఫున పవన్ కల్యాణ్ ప్రచారం

|
Google Oneindia TeluguNews

ప్రతిష్టాత్మక తిరుపతి లోక్ సభ స్థానంలో ఉప ఎన్నిక వేడిని మరింత పెంచుతూ బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి కత్తి రత్నప్రభ తొలిసారి నగరంలోకి అడుగుపెట్టారు. తిరుపతి అంతర్జాతీయ విమాశ్రయం వద్ద బీజేపీ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. నగరంలోకి అడుగు పెడుతూనే చేతిలో కమలం పువ్వు, మెడలో కాషాయ కండువాతో రత్నప్రభ ప్రచారంలోకి దిగిపోయారు.

నాన్నా.. నన్ను బయటికి తీయండి -బస్సు చక్రాల కింద నలిగి యువతి ఆర్తనాదం -విశాఖలో ఘోర ప్రమాదంనాన్నా.. నన్ను బయటికి తీయండి -బస్సు చక్రాల కింద నలిగి యువతి ఆర్తనాదం -విశాఖలో ఘోర ప్రమాదం

తిరుపతిలో తొలిసారి..

తిరుపతిలో తొలిసారి..

బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన తర్వాత తొలిసారి తిరుపతికి వచ్చిన రత్నప్రభ.. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, తిరుపతి బీజేపీ ప్రచార కమిటీ కన్వీనర్ ఆదినారాయణ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. జనసేనాని పవన్ కల్యాణ్ మద్దతు, టీడీపీ ప్రచార శైలిపైనా కీలక కామెంట్లు చేశారు. అదే సమయంలో తిరుపతి ఓటర్లకూ ఓ కఠిన సవాలు విసిరారు. రత్నప్రభ ఏమన్నారో ఆమె మాటల్లోనే..

జగన్ మరో సంచలనం: రెస్కోలకు మంగళం -డిస్కాముల్లో విలీనం -కుప్పం రెస్కోపై చంద్రబాబు ఘాటు లేఖజగన్ మరో సంచలనం: రెస్కోలకు మంగళం -డిస్కాముల్లో విలీనం -కుప్పం రెస్కోపై చంద్రబాబు ఘాటు లేఖ

జన్మభూమికి సేవ చేయాలనే..

జన్మభూమికి సేవ చేయాలనే..

''కర్ణాటక నా కర్మభూమి అయితే.. ఆంధ్రప్రదేశ్ నా జన్మభూమి. సొంత రాష్ట్రంలో పనిచేయాలన్న నా కోరిక ఇన్నేళ్లకు నిరవేరింది. మాతృభూమి కోసం పనిచేయడంలోనే అమితమైన ఆనందం ఉంటుంది. ఆంధ్రాపై అభిమానంతోనే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. తిరుపతి కోసమే కాకుండా యావత్ ఏపీ ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తాను. తిరుపతి నుంచి గెలిస్తే..

తేల్చుకోవాల్సింది ప్రజలే..

తేల్చుకోవాల్సింది ప్రజలే..

ఏపీ నుంచి వైసీపీ తరఫున పార్లమెంటుకు 22 మంది ఎంపీలు ఉన్నారు. కానీ వాళ్లలో ఏ ఒక్కరు కూడా కనీసం సొంత నియోజకవర్గాల సమస్యలపైనా సభలో మాట్లాడలేదు. తిరుపతి నుంచి నేను ఎంపీగా గెలిస్తే పార్లమెంట్ లో ఇక్కడి సమస్యల గురించి ధైర్యంగా మాట్లాడతా. మన గొంతు పార్లమెంట్ వరకూ వినిపిస్తా. సోమవారమే నెల్లూరులోని ఆర్వో కార్యాలయంలో తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రజలకు నేను ఒకటే చెప్పదల్చుకున్నాను. ప్రజలు ఆలోచన తీరు మారాలి. నీతి నిజాయితీలకు ఓటు వేయాలా.. లేక డబ్బులకు ఓటు వేటేయాలా అనేది జనమే నిర్ణయించుకోవాలి. వ్యక్తిగతంగా నాపై..

జగన్‌ను అభినందిస్తే తప్పేంటి?

జగన్‌ను అభినందిస్తే తప్పేంటి?

గతంలో సీఎం జగన్‌ను ప్రశంసిస్తూ నేనొక ట్వీట్ చేస్తే దాన్ని సోషల్‌మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. జగన్ మంచిపని చేస్తే ప్రశంసించాను. అందులో తప్పులేదు. కానీ అభినందించినత మాత్రాన నేను వైసీపీకి మద్దతు ఇచ్చినట్లు కానేకాదు. నా ట్వీట్ ను అటు వైసీపీ వాళ్లు, ఇటు టీడీపీ వాళ్లు వైరల్ చేస్తున్నారు. వైసీపీ వారేమో తమకు మద్దతు పలికిన వ్యక్తిగా, టీడీపీ వాళ్ళు జగన్ మనిషి అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జగన్ సీఎం గా గెలిచినప్పుడు నేను అభినందిస్తూ ట్వీట్ చేసిన మాట వాస్తవం. కానీ ఈ రకమైన తప్పుడు ప్రచారాలు తగవు. ఇకపోతే..

తిరుపతి ప్రచారానికి పవన్ కల్యాణ్

తిరుపతి ప్రచారానికి పవన్ కల్యాణ్


ఏపీలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు కొనసాగుతోంది. తిరుపతిలో బీజేపీకి జనసేన మద్దతు లేదంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. అది ముమ్మాటికీ అవాస్తవం. నా అభ్యర్థిత్వంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ 200 శాతం సంతృప్తిగా ఉన్నారు. తిరుపతిలో ప్రచారానికి రావాల్సిందిగా పవన్ ను ఆహ్వానిస్తే తప్పకుండా వస్తానని హామీ కూడా ఇచ్చారు. తిరుపతిలో గెలిచి, స్థానికుల గొంతును పార్లమెంటులో వినిపించడంతోపాటు ఏపీ ప్రజలందరి తరఫునా పోరాడుతా'' అని రత్నప్రభ అన్నారు.

English summary
tirupati loksabha by election BJP-Janasena candidate Ratnaprabha made serious comments on ap cm ys jagan. speaking to media at Tirupati ratna prabha accepted that once she was appreciated jagan but it doesn't mean that supported ysrcp. Janasena chief Pawan Kalyan had agreed to campaign for the BJP in Tirupati, says ratnaprabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X