వార్నీ: బెంజ్ కారు ఢీ కొట్టిన దెబ్బకు రెండు ముక్కలైన ట్రాక్టర్..!!
తిరుపతి: తిరుపతి సమీపంలో బైపాస్ రోడ్డు మీద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ఆయనను సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు స్వల్పంగా అంతరాయం ఏర్పడింది. ట్రాక్టర్‌ను పక్కకు తొలగించి- రాకపోకలను పునరుద్ధరించారు.
రేణిగుంట-చిత్తూరు బైపాస్‌పై ఈ ప్రమాదం సంభవించింది. కేఏ 04 ఎంయు 3456 నంబర్ గల బెంజ్ కారు తిరుపతి నుంచి చిత్తూరు వైపునకు వెళ్తోన్న సమయంలో బైపాస్‌పై రాంగ్ రూట్‌లో ఓ ట్రాక్టర్ అడ్డుగా వచ్చింది. యూటర్న్ తీసుకోవడానికి ప్రయత్నిస్తోండగా ట్రాక్టర్‌ను వేగంగా ఢీ కొట్టిందా బెంజ్ కారు. దీనితో కారు ఎడమ వైపు భాగం కొంతమేర దెబ్బతింది. అందులో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కలగలేదు.

అదే సమయంలో బెంజ్ కారు ఢీ కొట్టిన వేగానికి ట్రాక్టర్ ఇంజిన్ భాగం మొత్తం రెండు ముక్కలైంది. ట్రాలీ నుంచి విడిపోయింది. బోల్తా కొట్టింది. ట్రాక్టర్ ఇంజిన్ మొత్తం ధ్వంసమైంది. రోడ్డుపై చెల్లాచెదురుగా పడింది. ఇంజిన్ రెండుగా విడిపోయింది. అటు ట్రాలీ కూడా తలకిందులుగా రోడ్డుపై పడింది. ట్రాక్టర్ ముందు భాగం ఒకవైపు, డ్రైవర్ కూర్చునే వెనుకభాగం మరో వైపు విసిరేసినట్టుగా పడ్డాయి. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్‌కు గాయాలయ్యాయి.


బెంజ్ కారు ముందు భాగం మాత్రమే ధ్వంసమైంది. బెంజ్ కారు ఢీ కొట్టిన వేగానికి ట్రాక్టర్ వంటి భారీ వాహనం సైతం ముక్కలు కావడం పట్ల స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ సమయంలో కారు వేగం 100-120 కిలోమీటర్లకు వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. చెల్లాచెదురుగా పడ్డ ట్రాక్టర్ విడి భాగాలను పక్కకు తొలగించి వాహనాల రాకపోకలకు దారి కల్పించారు.












Click it and Unblock the Notifications