తిరుమలలో ప్రధాని మోదీ అక్కడ ఫొటో దిగడంపై పెను వివాదం: క్లారిటీ ఇచ్చిన భూమన

తెలుగు రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం తిరుమలను సందర్శించారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి.. ఆయనకు మహాద్వారం దగ్గర సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

స్వామివారి దర్శనానంతరం ఆలయ ఆవరణలో ఉన్న రంగనాయకులవారి మండపంలో మోదీకి అర్చకులు వేదాశ్వీరాదాలను పలికారు. తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. స్వామివారి శేషవస్త్రాన్ని బహూకరించారు. టీటీడీ టేబుల్ బుక్, పంచగవ్య ఉత్పత్తులు, 2024 డైరీ, క్యాలెండర్‌ను మోదీకి ఇచ్చారు.

TTD Chairman Bhumana Karunakar Reddy given clarity over the PM Modis Tirumala visit

ఇది కాస్త వివాదాన్ని రేకెత్తించింది. రంగనాయకుల మండపంలో ఉన్న శేషవాహనం ముందు ప్రధాని మోదీ ఫొటోలు దిగారని, అది సరికాదంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనికి టీటీడీ బోర్డు బాధ్యత వహించాల్సి ఉంటుందనే ఆరోపణలు వ్యక్తం అయ్యాయి.

దీనిపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. రంగనాయకుల మండపంలోని శేష వాహనం ముందు వీవీఐపీలకు శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం ఇవ్వడం, ఫొటోలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో మోదీకి వేదపండితులు ఆశీర్వచనం చేశారని చెప్పారు.

స్వామివారి శేష వాహనం ముందు ఇలా ఫొటోలు దిగడం సరి కాదంటూ ప్రచారం చేయడం సబబు కాదని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆలయానికి వచ్చే వీవీఐపీలకు రంగనాయకుల మండపంలోని శేష వాహనం ఎదుట స్వామివారి ప్రసాదాలు, చిత్రపటం తదితరాలు ఇవ్వడం, వారిని అడిగి ఫొటోలు తీసుకోవడం జరుగుతోందని గుర్తు చేశారు.

శ్రీవారి దర్శనానంతరం వీవీఐపీలు, వీఐపీలు రంగనాయకుల మండపంలోని శేష వాహనం ముందు ఫొటోలు తీసుకుంటుంటారని, ఇదివరకూ చాలాసార్లు అలాంటి ఫొటోలను తాము మీడియాకు విడుదల చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని భూమన అన్నారు.

మోదీ ఫొటో దిగడంపైనే అభ్యంతరం ఎందుకు లేవదీస్తోన్నారని ప్రశ్నించారు. కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని కూడా వివాదాస్పదం చేయాలనుకోవడం దౌర్భాగ్యమని భూమన మండిపడ్డారు. దేవుడి దర్శనాన్ని కూడా రాజకీయం చేసి విమర్శలు చేయడం దురదృష్టకరమని, ఇలాంటి దుర్మార్గపు ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+