తిరుమలలో ఇది పరిస్థితి, దర్శనానికి రెండు రోజులు, ఆలోచించుకుని కొండ మీదకు రండి !
తిరుమల/తిరుపతి: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువు తీరిన తిరుమలకు విపరీతంగా భక్తులు చేరుకున్నారు. శ్రీవారి దర్శనానికి టోకన్లు లేని భక్తులు వేల సంఖ్యలో తిరుమలలో అడుగుపెట్టడంతో తిరుమల కిటకిటలాడుతోంది. టోకన్లు లేని భక్తులు ఇంత పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటారని టీటీడీ అధికారులు అంచనా వెయ్యలేకపోయారు.
శుక్రవారం ఉదయం టీటీడీ ఈవో ఏవీ, ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతోందని చెప్పారు. అయితే పరిస్థితి తారుమారైయ్యింది. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో శ్రీవారి భక్తులు లక్షలాది మంది తిరుమలకు చేరుకున్నారు. ఇంత మంది శ్రీవారి భక్తులు తిరుమలకు చేరుకుంటారు అని టీటీడీ అధికారులు ఊహించలేకపోయారు.

శుక్రవారం రాత్రి టీటీడీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. దర్శనం టోకన్లు లేని భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి 48 గంటల సమయం పడుతోందని తెలిపారు. వేసవితో పాటు వారంతపు సెలవులు రావడంతో తిరుమలకు విశేషంగా భక్తులు పోటెత్తారని టీటీడీ అధికారులు అంటున్నారు.
ప్రస్తుతం తిరుమలలో రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని టీటీడీ అధికారులు మనవి చేస్తున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు తమవంతు వచ్చే వరకు సంయమనంతో వేచి ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుమల కొండ మీద ఉన్న శ్రీవారి భక్తులకు, క్యూ లైన్లలోని భక్తులకు, తిరులమలోని పలు ప్రాంతాల్లో అన్నప్రసాదాలు, మంచినీరు అందించడానికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
-
నేటి నుంచి ఒంటమిట్ట రాములోరి ఆలయంలో.. !! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications