తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే వారికి మరో అదిరిపోయే శుభవార్త!
తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వస్తారు. ఇక వీరిలో స్వామివారిని దర్శించుకోవాలని తాపత్రయం ఉన్న వృద్ధులు కూడా ఉంటారు. అయితే అటువంటి వృద్ధులు స్వామివారిని ఈజీగా దర్శించుకునేలా టిటిడి వారికి శుభవార్త చెప్పింది. సీనియర్ సిటిజన్ లకు స్వామి దర్శనం ఉచితంగా అందించడం కోసం రెండు స్లాట్లను కేటాయించింది టిటిడి.
వృద్ధులకు స్వామి దర్శనం సునాయాసం చేసిన టీటీడీ
దీంతో సీనియర్ సిటిజెన్లు ఈజీగా స్వామివారిని దర్శించుకోవచ్చని పేర్కొంది. ఉదయం 10గంటలకు, మధ్యాహ్నం మూడు గంటలకు రెండు స్లాట్లకు కేటాయించిన టిటిడి వృద్ధులకు స్వామివారి ఉచిత దర్శనం శీఘ్రంగా జరగడం కోసం తగిన చర్యలు చేపడుతున్నట్టు పేర్కొంది. అయితే దీనికోసం ఫో,టో ఐడి తో, పాటు వయస్సును నిర్ధారించే రుజువులు కూడా సమర్పిస్తే వారికి దర్శనం సులభం అవుతుంది.

S1 కౌంటర్ వద్దకు వెళ్లి దర్శనానికి టోకెన్
తమ అన్ని వివరాలతో S1 కౌంటర్ వద్దకు వెళ్లి నివేదిస్తే సరిపోతుంది. వంతెన దిగువన ఉన్న గ్యాలరీ నుంచి ఆలయం కుడి గోడ వద్ద రహదారిని దాటితే చాలు అక్కడ వృద్ధులు దర్శనం కోసం వేచి చూసే సౌకర్యాలను కల్పించారు. వృద్ధులు స్వామి దర్శనానికి వేచి ఉండడానికి అనుగుణంగా సీటింగ్ సౌకర్యము కల్పించారు.
వృద్ధులు కూర్చున్న చోటికే ఆహారం, అన్ని వసతులు
వారికి వేడి సాంబార్ అన్నం, పెరుగన్నం, వేడిపాలు ఇవన్నీ వారు కూర్చున్న దగ్గరకే సిబ్బంది తెచ్చి అందించేలా ఏర్పాట్లు చేశారు.
ఇక దర్శనం అనంతరం ఆలయం నుండి బయటకు వచ్చిన తర్వాత వీరిని డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారు కూడా అందుబాటులో ఉంది. ఎటువంటి ఒత్తిడి, ఎటువంటి అసౌకర్యం లేకుండా వృద్ధులు స్వామివారిని దర్శించుకోవడానికి టిటిడి ఏర్పాట్లు చేసింది.
వృద్ధుల దర్శనం వివరాల కోసం హెల్ప్ లైన్ నంబర్ ఇదే
దర్శనానికి క్యూ లైన్ లోకి వెళ్ళిన తర్వాత వీరు 30 నిమిషాలలోనే తిరుమల శ్రీవారిని దర్శించుకుని బయటకు వెళ్లిపోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకునే వారు హెల్ప్ లైన్ నెంబర్ 08772277777 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. స్వామి దర్శనానికి వచ్చే వృద్ధులు ఏ చింత లేకుండా ప్రశాంతంగా స్వామి వారిని దర్శనం చేసుకొని వెళ్ళొచ్చని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications