తిరుమల భక్తులకు అలర్ట్: నేటి నుంచి సేవా -దర్శన టికెట్ల విడుదల..!!
తిరుమల శ్రీవారి సేవా టికెట్లు నేటి నుంచి విడుదల చేయనున్నారు. సేవలతో పాటుగా అంగప్రదక్షిణం టోకెన్లు జారీ చేయనున్నారు.
Tirumala: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి సేవా టికెట్లు నేటి నుంచి విడుదల చేయనున్నారు. ఈ రోజు..రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లతో పాటుగా అంగప్రదక్షిణం.. వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇదే సమయంలో శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా వేడుకగా నిర్వహించారు. శ్రీపద్మావతి శ్రీనివాసుల కల్యాణఘట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ 4,411.68 కోట్ల బడ్జెట్ ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించింది. పలు కీలక నిర్ణయాలను టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు.
నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు జారీ
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూన్ నెల కోటాను మార్చి 23న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ఉన్నాయి. అదేవిధంగా, జూన్ నెలకు సంబంధించిన మిగతా ఆర్జితసేవా టికెట్లకు ఆన్‌లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ మార్చి 24న ఉదయం 11 గంటలకు మొదలవుతుంది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి 24న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వీటిని టీటీడీ వెబ్ సైట్ తో పాటుగా యాప్ ద్వారా భక్తులు టికెట్లను పొందే అవకాశం ఉందని టీటీడీ వెల్లడించింది.

రేపు శ్రీవారి దర్శన టోకెన్ల విడుదల
ఇదే సమయంలో..యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఏప్రిల్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మార్చి 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ శోభకృత్‌నామ సంవత్సర ఉగాది ఆస్థానం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు. శ్రీవారి ఉత్సవర్లను బంగారు వాకిలిలో గరుడాళ్వారుకు అభిముఖంగా సర్వభూపాల వాహనంపై వేంచేపు చేశారు.

బడ్జెట్ రికార్డు -31న శ్రీరామ పట్టాభిషేకం
ఉగాది పర్వదినాన భూలోక వైకుంఠంగా శ్రీవారి ఆలయాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ 4,411.68 కోట్ల బడ్జెట్ ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించిందని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ దేవస్థానం ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ ఆమోదించ లేదు. ఇది కత్త రికార్డు. వేసవిలో మొదలయ్యే రద్దీ కారణంగా శ్రీవాణి టికెట్ల జారీ తగ్గిస్తున్నట్లు చెప్పారు. వీఐపీ బ్రేక్ సిఫార్సులు తగ్గించాలని కోరారు. లడ్డూ కేంద్రాలను పెంచుతున్నారు. ఈ నెల 30, 31న తిరుమలలో తిరుమలలో శ్రీరామనమవి, శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒంటిమిట్టలో లో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications