టీటీడీ భక్తులకు గుడ్ న్యూస్ - తిరుమల వైకుంఠ ద్వార దర్శనం దక్కాలంటే..!!
తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ టికెట్ల విడుదలకు నిర్ణయించింది. తిరుమలలో జనవరి 2వ తేదీ నుంచ శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది. జనవరి 2వ తేదీ నుంచి రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్ లైన్ టికెట్లను రేపు విడుదల చేయనున్నారు. రోజుకు 20వేల టికెట్లు చొప్పున పది రోజులకు సంబందించిన టికెట్లను ఆన్ లైన్ ద్వారా అందుబాటులోకి తెస్తున్నారు. రోజుకు 20 వేల చొప్పున మొత్తం పది రోజులకు రెండు లక్షల టికెట్లు రేపటి నుంచి ఆన్ లైన్ ద్వారా పొందే అవకాశం కల్పించారు.
రేపు ఉదయం 11 గంటల నుంచి టికెట్లు టీటీడీ వెబ్ సైట్ లో అందుబాటులోకి రానున్నాయి. టికెట్లు కలిగిన వారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని ఇప్పటికే టీటీడీ స్పష్టం చేసింది. జనవరి 1వ తేదీ రద్దీ ఉంటుందనే అంచనాలతో టీటీడీ ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే బ్రేక్ దర్శనాల సమయాల్లో మార్పులు చేసిన టీటీడీ..జనవరి 1 కొత్త సంవత్సరం రద్దీ వేళ మరి కొన్ని నిర్ణయాలు అమలు చేయనుంది. వీఐపీలు నేరుగా వస్తే వారికి ప్రోటోకాల్ దర్శనం కేటాయించనుంది. సిఫార్సు లేఖలు తీసుకోకూడదని డిసైడ్ అయింది. జనవరి 2వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం గత సంప్రదాయాల మేరకు కొనసాగించనుంది.

అయితే, గతం కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేలా టికెట్లు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి సుప్రభాత సేవ ఈ మాసం మొత్తం రద్దు చేసారు. ఆ స్థానంలో తిరుప్పావై అమలు చేస్తున్నారు. సంక్రాంతి పర్వదినం పూర్తయ్యే వరకూ వీఐపీ బ్రేక్ దర్శనాల స్థానంలో సాధారణ భక్తులక ప్రాధన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఈ వారాంతం నుంచి సంక్రాంతి వరకు తిరుమల కొండ పైన భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ధర్మారెడ్డి స్థానంలో తాత్కాలిక ఈవోగా నియమితులైన అనిల్ కుమార్ సింఘాల్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. జనవరి 2వ తేదీ వరకు ఆయన ఈవోగా అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు.












Click it and Unblock the Notifications