తిరుమలలో వసతి గదుల బుకింగ్‌పై అప్‌డేట్

తిరుపతి: మే, జూన్ నెలకు సంబంధించిన 300 రూపాయల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మంగళవారమే విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో ఈ టికెట్లు విడుదల అయ్యాయి. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ https://tirupatibalaji.ap.gov.in/ లో మాత్రమే భక్తులు దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఇవ్వాళ తిరుమలలో మే నెలకు సంబంధించి వసతి గదుల కోటాను విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఈ కోటా విడుదలవుతుంది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా వసతి గదులను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం తిరుమలలో దాదాపు 7,500 గదులు భక్తుల కోసం అందుబాటులో ఉంటోన్నాయి. సుదర్శన్-386, గోవర్థన్‌-186, కళ్యాణి- 260 గదులు ఉన్నాయి. వీటిని సామాన్య భక్తులకే కేటాయిస్తున్నారు.

TTD to release Tirumala accommodation tickets through online today

వాటితో పాటు- అళ్వార్ ట్యాంక్ కాటేజీ, అంజనాద్రి నగర్, గరుడాద్రి నగర్, హిల్ వ్యూ, మంగళబావి, రామ్ బగీచ గెస్ట్ హౌస్-1, రామ్ బగీచ గెస్ట్ హౌస్-2, రామ్ బగీచ గెస్ట్ హౌస్-3, శంఖు మిట్ట, శేషాద్రి నగర్.. తదితర కాటేజీలను వినియోగిస్తోన్నారు. వీటిల్లో రోజువారీ అద్దె తక్కువగా ఉంటోంది. అత్యధికంగా 2,500 రూపాయల మొత్తాన్ని రోజువారీ అద్దెగా వసూలు చేస్తోన్న గెస్ట్ హౌస్‌లు తిరుమలలో అందుబాటులో ఉన్నాయి.

తిరుపతిలో వసతి గదులను పొందాలనుకునే వారికి గురువారం కోటా అందుబాటులోకి రానుంది. విష్ణునివాసం, శ్రీనివాసం, మాధవం కాంప్లెక్స్‌లల్లో శ్రీవారి భక్తులకు వసతి సౌకర్యాన్ని కల్పించింది టీటీడీ. అందులో గదులను పొందాలనుకునే వారి కోసం మే నెలకు సంబంధించిన కోటాను గురువారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. ఆన్‌లైన్ ద్వారానే బుక్ చేసుకోవల్సి ఉంటుంది. నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

దీనితో మే, జూన్‌కు సంబంధించిన అన్ని రకాల టికెట్ల కోటా జారీ ప్రక్రియ పూర్తవుతుంది. కళ్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా, శ్రీవాణి ట్రస్ట్, అంగప్రదక్షిణం టోకెన్లు, 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ అధికారులు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఇవ్వాళ, రేపు వసతి గదుల కోటా ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+