అక్రమంగా శ్రీవారి లడ్డూల తరలింపు - పోటులో అక్రమార్కులు..!!
తిరుమల శ్రీవారి పోటులో అక్రమార్కుల వ్యవహారం బయటకు వచ్చింది. శ్రీవారి పోటులో తయారు చేసిన లడ్డూలను తరలించి సొమ్ము చేసుకుంటున్న అక్రమాలను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో శ్రీవారి ఆలయ పోటులోని ఓ వ్యక్తితో పాటుగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అటు తిరుమలలో రద్దీ భారీగా పెరిగింది. దర్శనం కోసం 36 గంటల సమయం పడుతోంది. దాదాపు రెండు కిలో మీటర్ల మేర భక్తులు బారులు తీరారు. అకస్మాత్తుగా ఈ రద్దీ పెరిగింది.
లడ్డూల అక్రమ తరలింపు:తిరుమలలో లడ్డూ పోటులో పని చేసే వారే ఈ లడ్డూ అక్రమ తరలింపు వ్యవహారంలో ఉన్నట్లుగా గుర్తించారని సమాచారం. మూడు రోజుల క్రితం శ్రీవారి ఆలయంలోని లడ్డూ పోటు నుంచి బూందీపోటులోకి లడ్డూలను ట్రేలలోల కన్వేయర్ బెల్ట్ ద్వారా పంపారు. అక్కడ నుంచి లడ్డూ విక్రయ కేంద్రానికి ట్రేలు ట్రాలీల్లో సివ్వండి తరలించి, వారికి ఇచ్చిన కౌంటర్లలో చేరవేస్తున్నారు. ఈ నేపథ్యంలో లడ్డూ కౌంటర్లలోకి ఇవ్వాల్సిన ట్రేల కంటే అదనంగా 10-15 ట్రేలలో లడ్డూలు వచ్చినట్లు విజిలెన్స్ తనిఖీల్లో గుర్తించారు. ఒక ట్రేలో 50 లడ్డూలు ఉంటాయి. ఈ లెక్కన రూ 35 వేలకు పైగా విలువైన లడ్డూలను తనిఖీలు లేకుండా శ్రీవారి ఆలయం నుంచి నేరుగా లడ్డూ కౌంటర్లకు చేరినట్లు ప్రాధమికంగా తేల్చారు.

పోటులో అక్రమార్కులు:శ్రీవారి ఆలయం నుంచి నేరుగా లడ్డూ కౌంటర్లకు చేరడంలో శ్రీవారి ఆలయ పోటులోని ఒక వ్యక్తి కీలక భూమిక పోషించినట్లు తేల్చారు. మరో ముగ్గురిని కూడా టీటీడీ విజిలెన్స్ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తాజాగా ఈవో ధర్మారెడ్డి బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి లడ్డూ నిర్వహణ కౌంటర్లను పెంచాలని సూచించారు. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో శ్రీవారి లడ్డూ పోటులో అక్రమార్కుల వ్యవహారాన్ని టీటీడీ సీరియస్ గా తీసుకుంది. వారి పైన విచారణ పూర్తయిన తరువాత వారి పైన కఠిన చర్యలు ఉంటాయని చెబుతున్నారు. ఇదే సమయంలో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది.
భారీగా పెరిగిన రద్దీ:రెండు మూడు రోజులుగా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల చేరుకుంటున్నారు. దర్శనం టోకెన్లు లేకుండా క్యూ లైన్లలో వచ్చిన భక్తలు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి రింగ్ రోడ్డులోని శిలాతోరణం దాదాకు దాదాపు రెండు కిలో మీటర్లు బారులు తీరారు. వీరికి సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు.ఇక గురువారం భారీగా కురిసిన వర్షంతో తిరుమల లో శ్రీవారి ఆలయ మాడవీధుల్లో వర్షపు నీరు ప్రవహించింది. భక్తులు ఇబ్బందులు పడ్డారు. సెలవులతో పాటుగా వారాంతం కావటంతో భక్తుల రద్దీ కొనసాగే అవకాశాలు ఉన్నాయని టీటీడీ అంచనా వేస్తోంది.












Click it and Unblock the Notifications