దుర్గమ్మ ఆలయం వద్ద కేక్ ఘటన: ఏడుగురిని విధుల నుంచి తప్పించాం: ఈవో భ్రమరాంబ

బెజవాడ దుర్గమ్మ తల్లి ఆలయం అత్యంత పవిత్రమైంది. అక్కడ పనిచేసే వారు కూడా బాధ్యతతో మెలగాలి. కానీ కొందరు అలా చేయడం లేదు.. అవును పాశ్చాత్య పోకడలతో బర్త్ డే చేసుకుంటారు. కేక్ కట్ చేసి ఆలయ పవిత్రతను భగ్నం చేస్తున్నారు. అలాంటి ఘటన వెలుగుచూడగా.. విచారణ జరిపి నిజమేనని అధికారులు తేల్చారు. బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. విధుల నుంచి తప్పించారు. ఆలయంలో ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని స్పష్టంచేశారు.

కేక్ కట్ చేసి..

కేక్ కట్ చేసి..


ఇంద్రకీలాద్రిపై జన్మదిన వేడుకలు జరిగాయని ఈవో బ్రమరాంబ నిర్ధారించారు. ఇంద్రకీలాద్రిపై శానిటేషన్ సూపర్ వైజర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసినట్లు విచారణలో తేలిందన్నారు. ఏడుగురు తాత్కాలిక పారిశుద్ధ్య సిబ్బందిని తొలగించామని తెలిపారు. ప్రత్యేక భద్రతా విభాగానికి చెందిన కానిస్టేబుల్ విధుల నుంచి తప్పించామని చెప్పారు. మరో ప్రైవేట్ సెక్యురిటీ గార్డును తొలగించామని వెల్లడించారు. అమ్మవారి వద్ద ఇలాంటి ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఉద్యోగస్తులు, సిబ్బంది జాగ్రత్తగా మెలగాలని సూచించారు. దేవస్ధానం సంప్రదాయాలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని తేల్చిచెప్పారు.

ఏడుగురిపై చర్యలు

ఏడుగురిపై చర్యలు

శానిటేషన్ సూపర్ వైజర్ బర్త్ డే సందర్భంగా బుధవారం రాత్రి 12 గంటల సమయంలో అవుట్ సోర్సింగ్ శానిటరీ సిబ్బంది కేక్ కటించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడి మహారాజగోపురం ఎదుట కేక్ కట్ చేసి బర్త్ డే పార్టీ చేశారు. ఆలయ ఈవోకు తెలియటంతో సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. కొండపై పార్టీ చేసుకున్న ఏడుగురు శానిటరీ సిబ్బందిని విధులనుంచి తొలగించారు.

మందు కూడా కొట్టారట..

మందు కూడా కొట్టారట..


ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుతో సహా, ఒక ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పై కూడా చర్యలు తీసుకున్నారు.సమాచారం తెలుసుకున్న ఆలయ ఈవో బ్రమరాంబ కొంత మంది సిబ్బందిని నియమించి జరిగిన ఘటనపై విచారణ జరిపించారు. బర్త్ డే పార్టీతో పాటు కొందరు మద్యం సేవించినట్లు తెలియటంతో ఈవో దృష్టి సీరియస్ అయ్యారు. ప్రాథమిక విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు. ఆలయ పవిత్రతను భగ్నం చేసే రీతిలో ప్రవర్తించడం మంచి పద్దతి కాదన్నారు. తప్పును మొగ్గలోనే తుంచి వేయాలనే భావనతో గట్టి యాక్షన్ తీసుకున్నామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+