Akhanda: బెజవాడలో బాలయ్య: కనకదుర్గమ్మ దర్శనం..మంగళగిరి, పెదకాకానిల్లో: ఆన్‌లైన్ టికెట్లపై

విజయవాడ: నటసింహం నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రం అఖండ సూపర్ హిట్‌ను ఎంజాయ్ చేస్తోన్నారు. సినిమా విడుదలైన వారం రోజుల్లోపే 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరిందీ మూవీ. ఓవర్‌సీస్‌లోనూ దుమ్ము దులుపుతోంది. పేరుకు తగ్గట్టే.. కలెక్షన్లను రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ సక్సెస్‌ను బాలకృష్ణ ఎంజాయ్ చేస్తోన్నారు. తాను నటించిన సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న ప్రతీసారీ.. ఆలయాలను సందర్శించడాన్ని ఆనవాయితీగా పెట్టుకున్నారు. దాన్ని కొనసాగిస్తోన్నారు.

 కనకదుర్గమ్మ గుడిలో..

కనకదుర్గమ్మ గుడిలో..

బాలకృష్ణ, అఖండ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను విజయవాడలో సందడి చేస్తోన్నారు. ఈ తెల్లవారు జామున వారిద్దరూ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు బాలకృష్ణకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు బాలకృష్ణ-బోయపాటి శ్రీను. అనంతరం వారికి అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనాలు పలికారు.

మంగళగిరి, పెదకాకానిల్లో..

మంగళగిరి, పెదకాకానిల్లో..

అనంతరం గుంటూరు జిల్లా మంగళగిరికి బయలుదేరి వెళ్లారు. మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజలను నిర్వహించిన తరువాత పెదకాకానికి బయలుదేరి వెళ్తారు. అక్కడ పేరంటాలమ్మ అమ్మవారు, శివాలయాన్ని సందర్శిస్తారు. పెదకాకాని- బోయపాటి శ్రీను స్వగ్రామం. ఆయన ఇంట్లో బస చేస్తారు బాలకృష్ణ. మధ్యాహ్నం అక్కడే భోజనం చేస్తారు. సాయంత్రం మళ్లీ హైదరాబాద్‌కు వారిద్దరు బయలుదేరి వెళ్తారు.

రాత్రే విజయవాడకు..

రాత్రే విజయవాడకు..

కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి బాలకృష్ణ మంగళవారం రాత్రే విజయవాడకు చేరుకున్నారు. రాత్రి 10:30 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు స్వాగతం పలికారు. సెల్ఫీ దిగడానికి పోటీ పడ్డారు. వారందరినీ బాలకృష్ణ నిరాశ పర్చలేదు. ఓపిగ్గా సెల్ఫీ దిగారు. అభివాదం చేస్తూ కారులో బయలుదేరి వెళ్లారు. రాత్రి స్థానిక స్టార్ హోటల్‌లో బస చేశారు. ఈ తెల్లవారు జామునే కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.

పేరుకు తగ్గట్టే.. అఖండ

ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. అఖండ.. పేరుకు తగ్గట్టే అఖండమైన విజయాన్ని సాధించిందని అన్నారు. హిందు ధర్మాన్ని పరిరక్షించేలా, ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలనే సందేశాన్ని ఇచ్చిందని చెప్పారు. ధర్మాన్ని కాపాడితే.. ఆ ధర్మమే మనలను కాపాడుకుంటుందనే విషయాన్ని ఈ సినిమాలో చూపించామని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో సినిమా ఘన విజయం సాధించిందని, అందుకే మొక్కులు చెల్లించుకున్నామని చెప్పారు.

 ఇండస్ట్రీని కాపాడుకుంటాం..

ఇండస్ట్రీని కాపాడుకుంటాం..


ఆన్‌లైన్ టికెట్ల వ్యవహారంపై బాలకృష్ణ స్పందించారు. ఆన్‌లైన్ టికెట్లకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఏపీ హైకోర్టు కొట్టి వేసిందనే విషయం తనకు రాత్రే తెలిసిందని అన్నారు. దీనిపై ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేస్తుందని అంటున్నారని, తాము అన్నింటికీ సిద్ధ పడే సినిమాను విడుదల చేశామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లినా న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని, సినిమా ఇండ్రస్ట్రీని కాపాడుకుంటామని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+