విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధాని రైతుల ఆందోళనలు ఉధృతం ... నేడు జలదీక్షలు, గవర్నర్ తో భేటీ , వామపక్ష నేతల పర్యటన

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ప్రకటనపై వెల్లువెత్తుతున్న నిరసనలు నేటితో తొమ్మిదో రోజుకు చేరాయి. రాజధాని రైతుల పోరాటం ఇప్పటికే ఉధృతంగా సాగుతుంది. రేపే రాజధాని విషయంలో తుది నిర్ణయం తీసుకునే క్యాబినెట్ భేటీ కాబోతున్న నేపధ్యంలో నేడు మరింత ఉధృతంగా ఆందోళనలకు కార్యాచరణ రూపొందించారు రాజధాని గ్రామాల ప్రజలు, రైతులు .

నిలదీస్తారా..బుజ్జగిస్తారా: అమరావతి వైసీపీ నేతల కీలక భేటీ: ఏం తేల్చనున్నారు..!నిలదీస్తారా..బుజ్జగిస్తారా: అమరావతి వైసీపీ నేతల కీలక భేటీ: ఏం తేల్చనున్నారు..!

రేపే క్యాబినెట్ కీలక భేటీ ... నేడు ఉధృతంగా ఆందోళనలు చెయ్యనున్న రైతులు

రేపే క్యాబినెట్ కీలక భేటీ ... నేడు ఉధృతంగా ఆందోళనలు చెయ్యనున్న రైతులు

ఈ ఒక్క రోజే సమయం కావటంతో రేపే కేబినెట్‌ భేటీ నిర్వహించి తుది నిర్ణయం చేఫామని చెప్పిన నేపధ్యంలో రాజధాని ప్రాంత రైతుల్లో టెన్షన్ నెలకొంది. రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని పిల్లాజెల్లలతో రాజధాని తరలింపు వద్దంటూ ఆందోళన చేస్తున్నారు. రేపు క్యాబినెట్ భేటీ కానున్న నేపధ్యంలో కేబినెట్‌ సమావేశ నిర్ణయాన్ని ప్రభావితం చేసేవిధంగా ఆందోళనలను మరింత ఉధృతం చేసేందుకు రాజధాని రైతులు నేడు సిద్ధం అవుతున్నారు.

ఆందోళనకారులను అడ్డుకునే యత్నంలో పోలీసులు

ఆందోళనకారులను అడ్డుకునే యత్నంలో పోలీసులు

నేడు రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇక రాజధాని రైతులకు మద్దతుగా వామపక్ష నాయకులు కూడా నేడు రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు.ఇక రేపు కేబినెట్‌ భేటీ దృష్ట్యా రాజధాని ప్రాంతంలో అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటుంది.

నేడు రాష్ట్ర గవర్నర్ ను కలిసి వినతిపత్రం ఇవ్వనున్న రైతులు

నేడు రాష్ట్ర గవర్నర్ ను కలిసి వినతిపత్రం ఇవ్వనున్న రైతులు

ఇందుకోసం గ్రామ గ్రామాన పోలీసులు మోహరిస్తున్నారు. ఇక రాజధాని రైతులు తమ ఆందోళనను, ఆవేదనను రాష్ట్ర గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు సమయం కోరారు. వారు నేడు గవర్నర్ బిస్వభూషణ్ హరి చందన్ ను కలవనున్నారు. రాజధాని నగరంగా అమరావతిని వైసీపీ సర్కార్ కొనసాగిస్తుందా లేక ఇప్పటికే ప్రకటించిన మూడు ముక్కల రాజధానికే ఓటేస్తుందా అన్న టెన్షన్ రాజధాని ప్రాంత రైతుల్లో కనిపిస్తుంది.

ధర్నా చౌక్ లో ధర్నా , జలదీక్షలు , వామపక్ష నేతల పర్యటన

ధర్నా చౌక్ లో ధర్నా , జలదీక్షలు , వామపక్ష నేతల పర్యటన

ఇక నేడు రాజధాని రైతులకు మద్దతుగా సీపీఐ, సీపీఎం రాష్ట్రస్థాయి నేతలబృందం రాజధాని గ్రామాల్లో పర్యటించనుంది. నాయకులు రైతులతో మాట్లాడి, క్షేత్రస్థాయి పరిస్థితులను వారు రైతులను అడిగి తెలుసుకోనున్నారు. ఇక అమరావతి సంయుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా చౌక్‌లో ధర్నా చెయ్యనున్నారు రాజధాని రైతులు.మరోవైపు మందడం, తుళ్లూరు, కృష్ణాయపాలెం, వెలగపూడి,ఎర్రబాలెం తదితర రాజధాని గ్రామాల్లోనూ రైతులు ఆందోళనలను కొనసాగించనున్నారు. తాళ్లాయపాలెం తదితర కృష్ణానదీ తీరగ్రామాల్లో జలదీక్షలను కొనసాగించనున్నారు.

English summary
In support of the capital farmers, the CPI state leaders will tour the capital villages. Leaders will talk to farmers and ask them to know the conditions of the current situation. Under the aegis of the Joint Action Committee of Amaravathi, Dharna will be held in Vijayawada dharna Chowk.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X