15 ఏళ్లు జ‌గ‌నే సీఎం:స్వామీజీ! ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు అక్క‌డే: ఇద్ద‌రికీ ఆయ‌నపైనే గురి..!

ఏపీ ముఖ్య‌మంత్రి...తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇద్ద‌రికీ విశాఖ శార‌దాపీఠాధిపి స్వ‌రూపానంద అశీర్వాదం ఇచ్చారు. జ‌గ‌న్ సీఎం కావ‌టం కోసం అయిదేళ్ల పాటు శార‌దా పీఠం కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించింద‌ని..15 ఏళ్ల పాటు జ‌గ‌న్ సీఎంగా ఉండాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. జ‌గ‌న్..కేసీఆర్ అంటే త‌న‌కు ఎన‌లేని అభిమానం అని అంద‌రి స‌మ‌క్షం లో చాటి చెప్పారు. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు కార్య‌క్ర‌మం పూర్త‌య్యే వ‌ర‌కూ అక్క‌డే ఉన్నారు.

పూర్త‌యిన స‌న్యాసాశ్ర‌మ దీక్ష స్వీక‌ర‌ణ‌

పూర్త‌యిన స‌న్యాసాశ్ర‌మ దీక్ష స్వీక‌ర‌ణ‌

శారదా పీఠం ఆధ్వర్యంలో ఉత్తరాధికారి సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ ముగింపు మహోత్సవంలో ఏపీ- తెలంగాణ ముఖ్య‌మంత్రులు ఇద్ద‌రూ పాల్గొన్నారు. విశాఖలోని శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్‌శర్మ స‌న్యాన స్వీక‌ర‌ణ మ‌హోత్స‌వం ముగిసింది. సన్యాసాశ్రమ దీక్షను స్వీకరించిన కిరణ్‌కుమార్‌ శర్మకు స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేశారు. స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, స్వామి కిరణ్‌కుమార్‌ శర్మలకు ఇరువురు సీఎంలు వైఎస్‌ జగన్‌, కేసీఆర్‌ ఫలపుష్పాలు సమర్పించి.. ఆశీర్వాదం తీసుకున్నారు. స్వ‌రూపానంద త‌న ప్ర‌వ‌చ‌నంలో ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులుగా శ‌క్తి వంతులుగా అభివ‌ర్ణించారు. ఇక‌, కేసీఆర్ త‌ర‌హాలోనే జ‌గ‌న్ సైతం పూర్తిగా ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

15ఏళ్ల పాటు సీఎంగా జ‌గ‌న్..

15ఏళ్ల పాటు సీఎంగా జ‌గ‌న్..

స్వామి ప‌రిపూర్ణానంద త‌న ప్ర‌సంగంలో కేసీఆర్‌..జ‌గ‌న్ గురించి వివ‌రించారు. కేసీఆర్ రెండు సార్లు మ‌హాభార‌తం చ‌దివార‌ని...అటువంటి ముఖ్య‌మంత్రి దేశంలో మ‌రెవ‌రూ లేర‌ని స్వామిజీ చెప్పుకొచ్చారు. ఏపీలో దేవాదాయ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయ‌ని..వీటిని కాపాడ‌గ‌లిగిన శ‌క్తి జ‌గ‌న్‌కు మాత్ర‌మే ఉంద‌న్నారు. జ‌గ‌న్ సీఎం అవ్వ‌టం కోసం తాము అయిదేళ్ల పాటు అనేక ర‌కాలుగా శ్ర‌మించామ‌ని వివ‌రించారు. జ‌గ‌న్ అంతే త‌న‌కు అత్యంత ఇష్ట‌మ‌ని.. ఆయ‌న ప‌నిహేనేళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా ఉండాల‌ని ఆకాంక్షించారు. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు హైంద‌వ పార్టీల‌ని చెప్పుకొనే పార్టీల కంటే ఎక్కువ‌గా ధ‌ర్మానాకి ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని ప్ర‌శంసించారు.

ఆయ‌నంటే ఇద్ద‌రికీ గురి..

ఆయ‌నంటే ఇద్ద‌రికీ గురి..

విశాఖ శార‌దాపీఠాధిప‌తి అంటే ఇద్దరు ముఖ్య‌మంత్రుల‌కు గురి ఉంది. ఇద్ద‌రూ ఎన్నిక‌ల్లో గెల‌వ‌టం కోసం స్వ‌రూపా నంద రాజ శ్యామ‌ల యాగం చేసారు. ఇద్ద‌రూ ప్ర‌తీ సంద‌ర్బంలోనూ స్వామీజీ చెప్పిన ముహూర్తాల‌నే అనుస‌రిస్తారు. ఇద్ద‌రూ ప్ర‌మాణ స్వీకారాల మొద‌లు మంత్రి వ‌ర్గాల వ‌ర‌కు స్వామీజీ సూచ‌న‌ల మేర‌కే న‌డుచుకుంటున్నారు. ఇక‌, ఇద్ద‌రూ ముఖ్య‌మంత్రులు అయిన త‌రువాత విశాఖ‌కు వెళ్లి ఆయ‌న ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయ‌న మీద ఉన్న గురి కార‌ణంగా ఇద్ద‌రూ దాదాపు రెండు గంట‌ల పాటు స్వ‌రూపానంద నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. స్వామిజీ సైతం ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల మీద ప్ర‌శంస‌లు కురిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+