అమరావతి ఒక బంగారు బాతు... చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుపై సీఎం జగన్ యూటర్న్ తీసుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వివర్శించారు. ఏపీకి మంచి నగరం అవసరమని జగన్ గతంలోనే చెప్పారని ఆయన గుర్తు చేశారు. కాని అధికారంలోకి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకున్నారని అన్నారు. కాని టీడీపీ ఎప్పుడు ఒకే మాటమీద ఉంటుందని అన్నారు.

మరోవైపు అమరావతి అనేది బంగారుగుడ్లు పెట్టే బాతులాంటిదని అన్నారు. దాన్ని విధ్వంసం చేసేందుకు సీఎం జగన్ చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఈనేపథ్యంలోనే రాజధాని నిర్మాణం కోసం 33వేల ఎకరాలు ఇచ్చిన రైతులను ఆయన అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర అభివృద్ధి.. అధికార వికేంద్రీకరణతో కాకుండా.. అభివృద్ధి వికేంద్రీకరణతో సాధ్యమని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.

ap cm jagan has taken u turn on Amaravati :ChandrababuNaidu

ఇక సీఎం జగన్ పరిపాలన అంశాలపై కూడ చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలలో వైసీపీ నేతలు చెబితేనే పనులు జరిగే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర పార్టీలవారికి బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు.

మరోవైపు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నీరుగారిపోయే పరిస్థితిలో ఉందన్నారు. పోలీస్ వ్యవస్థ విశ్వసనీయత శాశ్వతంగా ఉండాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు మీడియం కూడా ఉండాలని కోరారు. అలాగే మీడియం ఎంచుకునే స్వేచ్ఛ విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉండాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+