ఏపీలో ఎల్లుండి నుంచి ఉదయం కర్ఫ్యూ- రెండు వారాల పాటు- జగన్ నిర్ణయం

ఏపీలో కోవిడ్‌ కల్లోలం కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి రోజు వారీ కేసుల సంఖ్య నిన్న 23 వేలు దాటిపోయింది. దీంతో జనం భయంతో అల్లాడిపోతున్నారు. మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతోంది. దీంతో ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఉదయం పూట కూడ కర్ఫ్యూ విధించేందుకు సిద్ధమవుతోంది.

రాష్ట్రంలో కరోనా కల్లోలంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ తాజా పరిస్ధితుల్ని అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. కోవిడ్‌ కేసుల నియంత్రణకు లాక్‌డౌన్‌ విధించాల్సిన అవసరం ఉన్నప్పటికీ వివిధ కారణాలతో కర్ప్యూతో సరిపెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నా పరిస్దితులు అదుపుతప్పడంతో ఉదయం పూట కూడా కర్ఫ్యూ పొడిగించాలని సీఎం జగన్ నిర్ణయించారు ఈ మేరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ అన్ని షాపులకు అనుమతిస్తారు. ఆ తర్వాత మాత్రం ఆంక్షలు అమలు చేస్తారు.

ap government to impose day curfew from day after tomorrow for next two weeks

రాష్ట్రంలో ఎల్లుండి నుంచి ఉదయం పూట పాక్షిక కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఉదయం 6 నుంచి 12 మధ్య మాత్రమే షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత మాత్రం 144 సెక్షన్‌తో పాటు మిగిలిన ఆంక్షలు కూడా కఠినంగా అమలు చేయబోతున్నారు. తద్వారా కోవిడ్ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రెండు వారాల పాటు ఇలాగే అమలు చేసి ఫలితాలు అంచనా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+