విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి పిటిషన్లపై హైకోర్టు కీలక విచారణ- విశాఖ గెస్ట్‌హౌస్‌ వివరాలు ఇవ్వని సర్కార్‌..

|
Google Oneindia TeluguNews

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన ప్రధానమైన 34 పిటిషన్లపై ఇవాళ కూడా హైకోర్టులో విచారణ సాగింది. ఇప్పటికే రోజువారీ విచారణ సాగుతున్న ఈ పిటిషన్లపై తొలి దశ వాదనలు పూర్తయ్యాయి. దీంతో తదుపరి విచారణను నవంబర్‌ 2వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

మూడు రాజదానులపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ప్రభుత్వం కాకినాడ, తిరుపతిలో సీఎం కోసం నిర్మించే గెస్ట్‌ హౌస్‌ల వివరాలను హైకోర్టుకు సమర్పించింది. విశాఖలో నిర్మించే గెస్ట్‌ హౌస్‌ డిజైన్లు ఇంకా పూర్తి కానందున ఇవ్వలేకపోతున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. టెండర్లు పూర్తయ్యాక వీటి వివరాలను హైకోర్టుకు అందజేస్తామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో విశాఖలో గెస్ట్‌హౌస్‌ నిర్మాణంపై దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు పెండింగ్‌లో ఉంచింది.

ap high court posts amaravati petitions arguments to november 2

రాజధానికి సంబంధించిన 34 ప్రధాన పిటిషన్లపై ముందుగా విచారణ చేపట్టిన న్యాయస్ధానం ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాదనలతో పాటు రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల అఫిడవిట్లు కూడా సేకరించింది. వీటి ఆధారంగా నవంబర్‌ 2వ తేదీ నుంచి తిరిగి రోజువారీ విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. ఈ లోపు ప్రభుత్వం తరఫున మిగిలిన వివరాలు అందజేయాలని సూచించింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై ఇప్పటికే దాఖలైన పిటిషన్లలో స్టే కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ ఇంకా ప్రారంభం కాలేదు.

English summary
andhra pradesh high court posts arguments over petitions filed over three capitals in the state to november 2nd. govt has submitted two cm guest houses in kakinada and tirupati and not yet submit details of vizag guest house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X