రైతులతో నిరసన ఎందుకు చంద్రబాబు, ‘అభివృద్ధి’కామెంట్లపై బొత్స సత్యనారాయణ ఫైర్
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం వల్ల అభివృద్ధి జరగదని చంద్రబాబు అంటున్నారని గుర్తుచేశారు. అలాంటప్పుడు రాజధాని ప్రాంత రైతులతో కలిసి ఎందుకు ఆందోళన చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు కపటనీతిని ప్రజలు గమనించాలని బొత్స సత్యనారాయణ కోరారు.

నిరసన ఎందుకు?
రాష్ట్రాభివృద్ధి కంపెనీలు, పరిశ్రమల వల్ల అని చంద్రబాబు చెప్తున్నారని బొత్స గుర్తుచేశారు. అయితే నిరసన చేయడానికి గల కారణం ఏంటి అని ప్రశ్నించారు. రాజధానికి కేవలం 5 వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని బొత్స విమర్శించారు. నిపుణుల కమిటీ సిఫారసు మేరకు రాజధాని మార్పు అంశం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. తమ ప్రభుత్వం కులానికి, మతానికి కొమ్ముకాయదని తేల్చిచెప్పారు.

ఆమడదూరం
గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో అభివృద్ధి ఎందుకు జరగలేదని బొత్స ప్రశ్నించారు. తన అనుయాయులకు భూములు కట్టబెట్టేందుకే చంద్రబాబు సమయం కేటాయించారని విమర్శించారు. బాలకృష్ణ చిన్న అల్లుడికి 500 ఎకరాల భూమి కేటాయించలేదా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. పరిశ్రమల కోసం కేటాయిస్తే ఓకే కానీ.. ఆ 500 ఎకరాల భూమిని సీఆర్డీఏ పరిధిలో చేర్చడం మాత్రం సరికాదని బొత్స అన్నారు.

దోపిడీ
గత ప్రభుత్వ హయాంలో దోపిడీ చేసి, ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారా అని మండిపడ్డారు. ప్రజలను కూడా మభ్యపెట్టి మోసం చేస్తున్నారని ఫైరయ్యారు. తాత్కాలిక శాసనసభ అమరావతిలో కొనసాగుతుందని బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. అమరావతిని ఎడ్యకేషన్ హబ్‌గా మారుస్తామని చెప్పారు. విశాఖ వేసవి కాల రాజధానిగా ఉంటుందని.. శ్రీబాగ్ ఒప్పందం మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతి, విశాఖపట్టణంలో కూడా బెంచ్‌లు ఉంటాయని పేర్కొన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications