విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ మంత్రుల్లో కొత్త ఆందోళన : సీఎంతో చెప్పుకున్నారు..కానీ : జగన్ వారికి ఏం చెప్పారంటే..!!

|
Google Oneindia TeluguNews

ఏపీ మంత్రుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఉద్యోగాల కల్పనలో తమ ప్రమేయం లేకపోతే తమను గుర్తుంకోరనేది ఒక అందోళన. పార్టీ కోసం పని చేసిన వారు తమకు ఉద్యోగాల కోసం తమ వద్దకు వస్తున్నారని ఏమీ చేయలేకపోతున్నామని వాపోయారు. ఆ సమయంలో ప్రభుత్వం నియమించే ఉద్యోగాల విషయంలో మాత్రం రూల్స్ పాటించాల్సిందేనని సీఎం జగన్ స్పష్టం చేసారు. ఆ విషయంలో రాజీ లేదని తేల్చి చెప్పారు. మరి..ఎమ్మెల్యేలు..తాము నిమిత్త మాత్రులుగా ఉండిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. దీనికి ముఖ్యమంత్రి జగన్ కీలక సూచన చేసారు.

దుబాయ్ శీనులు మోసపోయారు.. ముంచింది లేడీ.. వామ్మో కిలాడీ..!దుబాయ్ శీనులు మోసపోయారు.. ముంచింది లేడీ.. వామ్మో కిలాడీ..!

ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో జోక్యం చేసుకోవద్దు. అయితే..మీరు అడుగుతున్నారు కాబట్టి..వాటిల్లో మీ మాటకు విలువ ఇస్తారు...అంటూ అభయం ఇచ్చారు. ఇక..దీనికి కొనసాగింపుగా పధకాలు..హామీల అమలు విషయంలోనూ మంత్రులు కొందరు ముఖ్యమంత్రి వద్ద తమ మనసులోని మాట బయట పెట్టేసారు. దానికి జగన్ ఒక్క సారిగా నవ్వేసారు. వారి భయానికి తన సమాధానం ఏంటో వివరించారు. దీంతో..మంత్రులకు సరే అనక తప్పలేదు. ఇంతకీ ఏం జరిగింది....

AP ministers worried about schemes implementation in state and discuss with CM

జగన్ తో మంత్రుల మనసులోని మాట...
చాలా రోజుల తరువాత మంత్రులు ముఖ్యమంత్రి జగన్ తో మనసు విప్పి మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలు..నవరత్నాలను అప్పుడే అమలు చేస్తున్నారు. దశల వారీగా అమలు చేయటం ద్వారా ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. ఎన్నికల నాటికి వీటిని పూర్తిగా అమలు చేస్తే రాజకీయంగా కలిసి వస్తుందంటూ కొందరు మంత్రులు సీఎంకు సూచించారు. మరో సీనియర్ మంత్రి ఇప్పటి నుండే వీటిని అమలు చేయటం ద్వారా ఎన్నికల సమయానికి పెద్దగా ప్రయోజనం ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేసారు. అయితే..ముఖ్యమంత్రి మాత్రం ఇచ్చిన మాట అధికారంలోకి రాగానే అని చెప్పాం..దాని ప్రకారమే తొలి నుండి పధకాలు అమలు కావాల్సిందేనని జగన్ స్పష్టం చేసారు. మరో మంత్రి..ఆర్దికంగా ఇబ్బందులు ఉన్న సమయంలో వీటిని ఒకే సారి ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. దీని కారణంగా భారం రోజురోజుకీ పెరిగిపోతుందనే ఆందోళన వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి జగన్ మాత్రం అన్నింటికి పరిష్కారాలు ఉన్నాయని.. చెప్పబోతుండగా..మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయి..మరి ఆదాయం ఎలా పెరుగుతందని మరో మంత్రి జోక్యం చేసుకున్నారు. దీనికి జగన్ ఒకింత అసహనం తో ఇవన్నీ ఆలోచించకుండానే హామీలు ఇచ్చామా.. అన్ని ఖచ్చితంగా అమలు చేస్తాం. ఎన్నికల నాటికి అమలు చేస్తేనే ప్రయోజనం ఉంటుందనుకోవటం సరి కాదంటూ గట్టిగా సమాధానం ఇచ్చారు. అయితే, ఆ అయిదుగురు మంత్రుల్లో మాత్రం ఇప్పటి నుండే అన్నీ హామీలు అమలు చేయటం సరికాదనే అభిప్రాయం మరో సారి వ్యక్తం అయింది.

ఉద్యోగాల విషయంలో జగన్ ఇలా...
ఇక..మంత్రులు కొందరు సచివాలయ ఉద్యోగాల విషయంలో కొందరు అభ్యర్ధులు ప్రశ్నాపత్రం కఠినంగా ఉందని భావిస్తున్నారని లేవెనెత్తారు. ఉద్యోగాల విషయంలో మంత్రులుగా తమ మాటకు ప్రాధాన్యత ఇచ్చేలా అవకాశం ఇవ్వాలని పరోక్షంగా అభ్యర్ధించారు. ముఖ్యమంత్రి మాత్రం ససేమిరా అని తేల్చి చెప్పేసారు. ప్రశ్నాపత్రం కఠినంగా ఉంటే...మెరిట్ ఉన్న వారికే అవకాశాలు వస్తాయని..సచివాలయ ఉద్యోగాల విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని ఖరా ఖండిగా చెప్పారు. అదే విధంగా ప్రస్తుతం ఉన్న ఏ ఒక్క ఉద్యోగిని తొలిగించే ఉద్దేశం లేదనే విషయాన్ని స్పష్టం చేసారు. పార్టీ కోసం పని చేసిన వారికి మంత్రులుగా తాము..ఎమ్మెల్యేలు ఉపాధి విషయంలో ఎటువంటి సాయం చేయలేకపోవటం ద్వారా..క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు వస్తున్నాయని సీఎంకు వివరించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే మద్యం దుకాణాల్లో ఇచ్చే ఉద్యోగాల్లో అయినా ఎమ్మెల్యేలు చెప్పిన వారికి ఇచ్చే విధంగా చూడాలని కోరారు. దీని పైన తాను చర్చించి చెబుతానని..ప్రభుత్వ మద్యం దుకాణాలు ఇప్పుడు ఏర్పాటు చేసినా.. అయిదేళ్ల కాలం ముగిసేలోగా సంపూర్ణ మధ్యపాన నిషేధం అమలవుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. ఈ ఉద్యోగాల వరకు మంత్రులు..ఎమ్మెల్యేలు సిఫార్సులు చేయటానికి పెద్దగా అభ్యంతరాలు ఉండవని సీఎం పరోక్షంగా అనుమతి ఇచ్చినట్లు సమాచారం. దీంతో..ముఖ్యమంత్రి జగన్ ఎవరి ఏం చెప్పినా.. తాను డిసైడ్ అయిన మార్గంలోనే ముందుకు వెళ్తున్నారనే విషయం మంత్రులకు మరోసారి అర్దం అయింది. దీని పైన మంత్రులు అంతర్గత చర్చల్లో షేర్ చేసుకుంటున్నారు.

English summary
AP ministers worried about schemes implentation in state and discussed with CM. Jagan Assured them no need to worry about finance and schemes situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X