విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒకే ఒక్క ఓటుతో గెలిచిన వైఎస్సార్సీపీ మద్దతుదారు సర్పంచ్ అభ్యర్థి

|
Google Oneindia TeluguNews

కృష్ణా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ తొలి దశ ఎన్నికల ఫలితాల్లో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు భారీ సంఖ్యలో విజయాలను నమోదు చేశారు. రెండో స్థానంలో టీడీపీ మద్దతుదారులు ఉండగా, బీజేపీ-జనసేన మద్దతుదారులు విజయాలు సింగిల్ డిజిట్‌కే పరిమితమైనట్లు కనిపిస్తోంది.

ఏపీ పంచాయతీ తొలిదశ ఎన్నికల ఫలితాలు: జగన్ పార్టీ మద్దతుదారులదే హవా, డీలాపడ్డ టీడీపీఏపీ పంచాయతీ తొలిదశ ఎన్నికల ఫలితాలు: జగన్ పార్టీ మద్దతుదారులదే హవా, డీలాపడ్డ టీడీపీ

కాగా, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కందలంపాడులో ఒక్క ఓటు సర్పంచ్ అభ్యర్థి విజయాన్ని మార్చేసింది. కందలంపాడు సర్పంచ్‌గా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు బైరెడ్డి నాగరాజు విజయం సాధించారు. ప్రత్యర్థి మొవ్వ సుబ్రహ్మణ్యంపై కేవలం ఒకే ఒక్క ఓటుతో గెలుపొందారు.

ap panchayat phase-I election results 2021: one vote changed the victory in krishna district

చిన్న గ్రామం కావడంతో 203 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. వీటిలో నాగరాజుకు 102 ఓట్లు రాగా, సుబ్రహ్మణ్యంకు 101 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ చేసినా అదే ఫలితం రావడంతో అధికారులు నాగరాజును సర్పంచ్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు. కంకిపాడు మండలంలోని జగన్నాథపురంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిన్నిబోయిన శ్రీనివాసరావు కేవలం 3 ఓట్లతో గెలుపొందారు. ఇలా మరికొన్ని పంచాయతీల్లో కూడా తక్కువ ఓట్లతోనే గెలుపోటములు నమోదయ్యాయి.

ఇప్పటి వరకు నమోదైన ఫలితాల ప్రకారం.. పార్టీల మద్దతుదారుల విజయాలు ఇలా..

శ్రీకాకుళం:
వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 152, టీడీపీ మద్దతు దారులు-21, ఇతరులు-1

విశాఖపట్నం:
వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 93, టీడీపీ మద్దతు దారులు--1, ఇతరులు-0

తూర్పుగోదావరి:
వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 73, టీడీపీ మద్దతు దారులు--0, ఇతరులు-0

కృష్ణా:
వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 61, టీడీపీ మద్దతు దారులు--1, ఇతరులు-1

గుంటూరు:
వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 109, టీడీపీ మద్దతు దారులు--7, ఇతరులు-0

ప్రకాశం:
వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 95,టీడీపీ మద్దతు దారులు--10, ఇతరులు-0

నెల్లూరు:
వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 90, టీడీపీ మద్దతు దారులు--3, ఇతరులు-1

చిత్తూరు:
వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 212, టీడీపీ మద్దతు దారులు--16, ఇతరులు-1

అనంతపురం:
వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 61, టీడీపీ మద్దతు దారులు--9, ఇతరులు-1

కర్నూలు:
వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 111, టీడీపీ మద్దతు దారులు--7, ఇతరులు-2

కడప:
వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 63, టీడీపీ మద్దతు దారులు-1, ఇతరులు-0

పశ్చిమగోదావరి:
వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 100, టీడీపీ మద్దతు దారులు-1, బీజేపీ మద్దతుదారులు-2, ఇతరులు-1

English summary
ap panchayat phase-I election results 2021: one vote changed the victory in krishna district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X