విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిమ్మగడ్డ సుడిగాలి పర్యటన: పోలింగ్ బూత్‌లల్లో సర్‌ప్రైజ్ విజిట్

|
Google Oneindia TeluguNews

విజయవాడ: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. సరిగ్గా ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. గడువు ముగిసిన తరువాత కూడా.. క్యూ లైన్‌లో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు. రాష్ట్రంలో మొత్తం 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోలింగ్ కొనసాగుతోంది. వాటిల్లో పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల మున్సిపాలిటీలు ఇదివరకే ఏకగ్రీవం అయ్యాయి.
మొత్తం 78,71,272 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజయవాడలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పోలింగ్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. పోలింగ్ బూత్‌లను సందర్శిస్తున్నారు. కొద్దిసేపటి కిందటే ఆయన విజయవాడ బిషప్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌ను పరిశీలించారు. ఆ సమయంలో ఆయన వెంట కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, రెవెన్యూ అధికారులు ఉన్నారు. బిషప్ స్కూల్ అనంతరం సీవీఆర్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. పోలింగ్ ఏజెంట్ల గురించి ఆరా తీశారు. వారి వివరాలను తెలుసుకున్నారు.

APSEC Nimmagadda Ramesh Kumar inspecting the polling booths in Vijayawada

ఓటు వేయడానికి వచ్చిన వారితో మాట్లాడారు. పోలింగ్ ఏర్పాట్లు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలను అతిపెద్ద పండుగగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభివర్ణించారు. ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని కోరారు. ఓటు వేయడం ద్వారా రాజ్యాంగాన్ని గౌరవించుకున్నట్టవుతుందని అన్నారు. దేశం పట్ల తమకు ఉన్న గౌరవాన్ని ప్రదర్శించడానికి ఇంతకంటే మంచి సమయం దొరకదని నిమ్మగడ్డ పేర్కొన్నారు.

English summary
Andhra Pradesh State Election Commissioner Nimmagadda Ramesh Kumar along with Krishna District Collector Imtiaz inspecting the polling arrangements at Bishop Grassi High School in Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X