Ayodhya Final verdict: రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదు... ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తి
దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన సుదీర్ఘకాలం కొనసాగిన అతి సున్నితమైన అయోధ్య వివాదం కేసులో సుప్రీం కోర్టు తన తీర్పును వెల్లడించింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకాభిప్రాయంతో అయోధ్య కేసుపై తీర్పును వెలువరించింది. ఉత్కంఠభరితంగా సాగిన జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పులో ముందుగా... అయోధ్య భూమి విషయంలో రాజకీయాలు చరిత్రకు అతీతంగా తీర్పు ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాల్నీ, నమ్మకాల్నీ సుప్రీంకోర్టు గౌరవిస్తుందని తెలిపారు.
బాబ్రీ మసీద్ నిర్మాణానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లేవని, రామజన్మభూమి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది అయోధ్య వివాదాస్పద స్థలంలో మసీదు నిర్మాణానికి ముందు ఒక నిర్మాణం ఉండేదని పేర్కొంది ఇక మొఘలుల కాలం నుండే బాబ్రీ మసీదు పై తమకు హక్కు ఉందని వక్ఫ్ బోర్డు నిరూపించలేక పోయిందని స్పష్టం చేసినా సుప్రీం ధర్మాసనం పురావస్తు శాఖ ఆధారాలను సమర్పించిన కారణంగా అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువుల దేనని పేర్కొంది. అయితే కొన్ని కండిషన్ లతో హిందువులకు అయోధ్య భూమి చెందుతుందని తీర్పులో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేయాలని, అలాగే మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలని ఐదెకరాల స్థలం సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని పేర్కొంది.

ఇక అయోధ్య వివాదాస్పద భూమిపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. అయోధ్య నిర్మాణం విషయంలో సుప్రీం తీర్పు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలు తెలియజేసిన మీదటనే సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించినదని అన్నారు.
అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసినమీదటే ఈ విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడింది. ఇటువంటి పరిస్థితుల్లో మతసామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకూ విజ్ఞప్తిచేస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 9, 2019
ఇలాంటి పరిస్థితుల్లో మత సామరస్యానికి భంగం కలిగించేలా రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ పోలీస్అధికారులను ఆదేశించారు.
ప్రజలందరుకూడా సంయమనం పాటించి శాంతి భద్రతలకు సహకరించమని విజ్ఞప్తిచేస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 9, 2019
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications