• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా పోయినట్లేనా.. బీజేపీ కన్నేసిందా.. ముహుర్తం ఎప్పుడంటే..!

|

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయా? టీడీపీ అధికారం కోల్పోయి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోందా? అధికారంలోకి వచ్చిన వైసీపీ దూకుడు పెంచిందా? ఆ రెండు పార్టీలను తోసిరాజని మరోవైపు బీజేపీ స్ట్రాటజీ ప్లే చేస్తోందా? ఇలాంటి ప్రశ్నలకు ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాలు సమాధానంగా కనిపిస్తున్నాయి.

23 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది టీడీపీ. అయితే ఆ హోదాపై బీజేపీ కన్నేసిందనే ప్రచారం జరుగుతోంది. ఆ మేరకు బీజేపీ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ దేవ్‌దర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

అమరావతిలో ఘరానా దొంగలు.. మట్టి, తట్ట అన్నీ మాయం.. ఏపీ రాజధానిలో ఏం జరుగుతోంది?

జగన్ నిర్ణయాలతో సైకిల్ పంక్చరేనా?

జగన్ నిర్ణయాలతో సైకిల్ పంక్చరేనా?

ఏపీ రాజకీయాలు మలుపు తిరగబోతున్నాయనే వాదనలు జోరందుకున్నాయి. టీడీపీ అధికారం కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితమైంది. ఆ క్రమంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రులు టార్గెట్‌గా.. సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటుండటం చర్చానీయాంశమైంది. దాంతో ఆ పార్టీ భవితవ్యం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా.. జగన్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోందనే ప్రచారం జోరందుకుంది. ఆ క్రమంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అటు ఇటు చూస్తున్నారనే వాదనలు లేకపోలేదు. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉంటే.. నో యూజ్ అనుకుంటున్నారో ఏమో గానీ అల్టర్నేట్ మార్గాల వైపు కన్నేశారనే టాక్ నడుస్తోంది. ఆ క్రమంలో బీజేపీ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ దేవ్‌దర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

బండారం బయటేసి జైలుకు పంపిస్తే ఎట్టా? ఆందోళనలో తమ్ముళ్లు..!

బండారం బయటేసి జైలుకు పంపిస్తే ఎట్టా? ఆందోళనలో తమ్ముళ్లు..!

టీడీపీ ప్రభుత్వంలో భారీగా అవినీతి జరిగిందనేది వైసీపీ నేతల వాదన. ఆ క్రమంలో ఆ అక్రమాలు జగన్ ప్రభుత్వం బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ చంద్రబాబు బండారం బయటేసి ఆయన్ని జైలుకు పంపితే.. తమ పరిస్థితేంటనే ధోరణిలో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు కొట్టుమిట్టాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అందుకే పార్టీ మారే యోచనలో చాలామంది టీడీపీ నేతలున్నట్లు టాక్ వినిపిస్తున్నా.. అది ఎంతవరకు నిజమనేది మాత్రం ఎవరూ బయటపెట్టడం లేదు. అయితే ఇప్పటికే 18 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని.. బీజేపీ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ దేవ్‌దర్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు మరో అడుగు ముందుకేసి ఏపీలో త్వరలోనే టీడీపీ ప్రతిపక్ష హోదా కోల్పోయి.. ఆ స్థానంలో బీజేపీ రావడం ఖాయమని మాట్లాడిన తీరు హాట్ టాపిక్ అయింది. అదలావుంటే చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికితీయాలని ఆయన డిమాండ్ చేయడం వెనుక అసలు పరమార్థం ఏంటో ఇట్టే అర్థమవుతుంది.

అటు అధికారం పాయే.. ఇటు ప్రతిపక్షం హోదా కూడా దక్కనివ్వరా?

అటు అధికారం పాయే.. ఇటు ప్రతిపక్షం హోదా కూడా దక్కనివ్వరా?

టీడీపీ అధికారం కోల్పోయి వంద రోజులవుతోంది. ఆ క్రమంలో ప్రతిపక్షం హోదా కూడా పోనుందనే రీతిలో సునీల్ దేవ్‌దర్ వ్యాఖ్యానించిన తీరు పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. ఒకవేళ బీజేపీ ఆ స్ట్రాటజీ తీసుకుంటే గనక టీడీపీ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చనుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అదలావుంటే జులై 8వ తేదీన వచ్చే వైఎస్‌ఆర్ జయంతి తర్వాత జగన్ కొన్ని దూకుడు నిర్ణయాలు తీసుకుంటారనేది టాక్.

ఆ క్రమంలో జగన్ కఠిన నిర్ణయాలు తీసుకుని.. చంద్రబాబును జైలుకు పంపిస్తారేమోననే వాదనలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ చంద్రబాబుకు అలాంటి పరిస్థితి వస్తే.. తమకు కూడా ఇబ్బందులు తప్పవేమోనని టీడీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చుని ఇబ్బందులు పడేకంటే పార్టీ మారడం మేలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇద్దరు యువకుల మధ్య 'ఆ సంబంధం'.. ప్రాణాలు పోయేదాకా వ్యవహారం..!

వైసీపీ వైపు చూసినా.. కలిసివచ్చే అవకాశం లేదుగా..!

వైసీపీ వైపు చూసినా.. కలిసివచ్చే అవకాశం లేదుగా..!

చంద్రబాబును కాదని ఒకవేళ తమ్ముళ్లు గోడ దూకాల్సి వస్తే ఏ పార్టీలోకి వెళతారనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. అయితే వైసీపీ వైపు ఓ కన్నేసినా.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించబోనంటూ జగన్ చెప్పిన మాటలు వారిని ఇరకాటంలో పడేస్తున్నాయనే టాక్ నడుస్తోంది. ఎవరు తమ పార్టీలోకి వచ్చినా రాజీనామా చేసి.. తిరిగి వైసీపీ గుర్తు మీద పోటీచేసి గెలవాలనేది జగన్ పెట్టిన కండిషన్. అయితే మళ్లీ ఎన్నికల్లో పోటీచేయడం, గెలవడం.. అదంతా కుదరని పని భావించి బీజేపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ మేరకు 18 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ దేవ్‌దర్ చేసిన వ్యాఖ్యలు బలం చేకూరుస్తోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP Leaders eyes on ap assembly opposition status. The talk goes on, bjp leaders trying to take a chance in andhrapradesh politics. In that way they were saying, the tdp leaders will touch in. BJP Leaders plans that they try to take up the tdp mlas into party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more